అంతరంగ సాక్షి

అంశం: మనస్సాక్షి

అంతరంగ సాక్షి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: శ్రీదేవి విన్నకోట

అంతరంగపు సత్య అసత్యపు సాక్ష్యం మనస్సాక్షి.
దారితప్పి ఏమార్చే మన నడవడికను
సరైన దారిలోకి తీర్చిదిద్దేదే మనస్సాక్షి.

వెలుగునీడల సయ్యాటల్లో మంచేదో చెడేదో
ప్రతిరూపమై తెలిపేదే మన మనస్సాక్షి.
పయనించే బ్రతుకనే జీవనబాటలో

ప్రతిక్షణం అప్రమత్తమై నిలిపేదే మనస్సాక్షి.
కల్మషమెరుగని నయనాల్లో స్వచ్ఛంగా
నిండు చందమామై ప్రతిఫలించేదే మన మనస్సాక్షి.
మనస్సాక్షికి మించిన మిత్రుడు, శత్రువు
ఈ లోకాన లేనేలేదు, అన్నింటి మూలం మనస్సాక్షి

మన మనసుకి సాక్షి భూతం ఈ మనస్సాక్షి.
కష్టాన్నికైనా సుఖానికైనా సాంత్వనే మన మనస్సాక్షి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!