వాడిన మనుసు(షు)లు

వాడిన మనుసు(షు)లు

రచన: సూర్యదేవర స్వాతి

కనురెప్పల మాటున కన్నీటి సంద్రాన్ని దాచి కవ్వించడం నేర్చాము…

గుండెలోపల బద్దలయ్యే లావాని అణిచి అందాలని మాత్రమే చూపడం మొదలెట్టాము…

మా ఆకలి తీర్చుకోవడానికి….,
ఒకరి ఆకలికి వడ్డించిన విస్తర లా మారి…
చివరికి ఎంగిలాకులా మిగిలాము….

కొందరు కమాంధులకి  బొమ్మ గా…
మరి కొందరికి వాడే వస్తువులా మారిపోయాము…..

అందం శాపమై ఒకరం…
నా అన్న వాళ్ళ కష్టాలు తీర్చడానికి మరొకరం..
మోసపోయి ఒకరం…
అఘాయిత్యానికి బలయ్యి ఒకరం..
కారణం ఏమైతేనేం …

చివరకు సమాజంలో గౌరవం లేని…
వ్యక్తిత్వం లేని…
జీవం ఉన్న   ఆటబొమ్మలమై…
చివరకు వేశ్యలా మిగిలిపోయాము!!.

******

You May Also Like

One thought on “వాడిన మనుసు(షు)లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!