గాన గంధర్వుడు

గాన గంధర్వుడు

రచన: జె వి కుమార్ చేపూరి

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
అది తల్లిదండ్రులు పెట్టిన నామధేయం
బాలుగా రస ప్రియులకు సుపరిచితం
అవనికి అక్కరలేదు ఆతని పరిచయం

పుట్టుకతోనే పరిమళించిన పుష్పం
పసితనానే అబ్బిన తీయని గాత్రం
తన ప్రతిభకు సినిమా ఆహ్వానం
ఏమి ఈ వింత మోహం తోలి గీతం

కంఠానుకరణ తనకు దేవుడిచ్చిన వరం
అదే తనను ముందుకు నడిపిన బలం
డబ్బింగ్, నటనకూ సరితూగిన వైనం
దక్షిణాది భాషలలో ఏకచక్రాధిపత్యం

దేశభాషలోనూ అమరిన తీయని గానం
ఏ భాషైనా తన పాటలతో ఓలలాడిన జనం
శంకరాభరణం తన బ్రతుకున మైలురాయి
పాడిన నలభైవేల పాటలొక కలికితురాయి

తనను వరించిన పద్మాలు మూడు
ఎన్నో చిత్రాలకు తానుత్తమ గాయకుడు
తెలుగు భాషకు పట్టం కట్టిన అమరుడు
సంగీత జగాన తిరుగులేని మొనగాడు

ఒరిగింది ఒక గాన గాంధర్వ శిఖరం
నేటికీ సంగీత ప్రియులకు మిగిల్చి శోకం
వర్ధంతి వేళ మధుర గాయకుని స్మరణం
చూపుతుంది తనపై మనకున్నమమకారం

==== * ==== * ====

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!