నా మాటే వినాలి

నా మాటే వినాలి

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

“మీరు ఎన్నైనా చెప్పండి.నేను చెప్పినట్టు మీరు చేయాల్సిందే.ఇంతకు ముందు చెప్పాను.ఇప్పుడూ
చెబుతున్నాను.మీరు కాదంటే చెప్పండి నా దారి నేను
చూసుకుంటాను”అంటూ ఖచ్చితంగా చెప్పేసింది
అరుణ.
“అంతవరకు వచ్చిందా వ్యవహారం.సరే నీకే అంత పట్టుదలైతే నాకుండదా.అయినా నేనిప్పుడు నీ మాట కాదని నేనేంచేస్తున్నానో చెప్పు.నువ్వేదంటే అదే కదా
చేస్తున్నాను”సమర్ధించుకున్నాడు రమేశ్.
“ఎక్కడండి నామాట వింటున్నారు.మీ అమ్మానాన్నలను మీ తమ్ముడి దగ్గరికి పంపించేయమన్నాను.పంపించారా ?లేదే?”మళ్ళీ రెట్టించింది అరుణ.
“అది మాత్రం జరగదు సుమా.వాళ్ళిక్కడే వుంటారు.
వాడింకా పూర్తిగా సెటిల్ కాలేదు.తెచ్చుకుంది
వాడికే చాలటం లేదు.వీళ్ళని వాడెలా చూస్తాడు చెప్పు”సర్ది చెప్పాడు.
“ఎందుకు చూడలేడు.అందులోనే సర్దుకుంటారు.మీ నాన్నగారి పెన్షన్ వస్తుందికదా.సగం మనకి సగం తనకి
ఇమ్మనండి.మనమే ఎలాగో సర్ధుకుందాం”అరుణ తన పట్టు విడవలేదు.
“ఆ పెన్షను డబ్బులు కోసమే కదా వాళ్ళని మనదగ్గర ఉంచుకున్నాం.ఇప్పుడు ఇలా మాట్లాడు తున్నావా?
అంతా నీ ఇష్టమేనా?”మళ్ళీ రమేశ్ తన మాటలను
చెప్పాడు.
“ఇంతకీ మీరేమంటారు?నేను చెప్పింది చెయ్యరా?రేపే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను .మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.”తెగేసి చెప్పింది అరుణ.
ఇక రమేశ్ తగ్గక తప్పలేదు.అరుణకోరినట్లే తల్లిదండ్రలను తమ్ముడి వద్దకు పంపించేసాడు.
కొందరి జీవితాలంతే?!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!