సగటు అమ్మాయి

(అంశం:” తుంటరి ఆలోచనలు”)

సగటు అమ్మాయి

మంగు కృష్ణకుమారి

పాతికేళ్ళ కిందట:

“మంజూ, నీకోసం మాధవ్ వస్తున్నాడు, ఆగవే” మెడికల్ కాలేజ్
లైబ్రరీ వేపు అడుగులేస్తున్న మంజులతొ భవానీ కొంటెగా అంటూ మాధవ్ ని చూపించింది.

మంజుల అడుగులు తడబడ్డాయి. మెళ్ళో స్టెత్ తో వస్తున్నాడు మాధవ్.
మాధవ్ చాలా నీట్ గా టక్ చేసుకొని మంజుల దగ్గరకి వచ్చేడు. భవానీ
మంజులని పొడుస్తూ “ఏం నేను వెళిపోవాలా? మీ మధ్య నేనెందుకూ?”
అంది. మంజుల చెంపలు ఎర్రబడ్డాయి.
“షటప్.. ఊరికే ఎక్స్‌ట్రాలు చెయ్యకు”
అంది. మాధవ్ మంజుల చక్కటి ప్రేమిలులనీ అక్కడ చాలామందికి
తెలుసు. మాధవ్ ఎమ్ డి చేస్తున్నాడు. మంజుల, భవానీ హౌస్ సర్జన్స్.

భవానీ “హాయ్ మాధవ్… మీట్ యూ ఎగైన్” అని చెయ్యి ఊపి వెళిపోయింది.

మాధవ్ తో ఏకాంతం అంటే మంజులకి
కొంచెం సిగ్గూ, కొంచెం ఉద్వేగం.

అతని చూపులు తాకుతూ గిలిగింతలు
పెడుతూ ఉంటాయి. ఆ రోజు ఆకుపచ్చచీరలో మెరిసిపోతోంది మంజుల.

“మంజూ… ఉష నీకు చెప్పిందట కదా..
తన కొడుకు క్రేడిల్ ఫంక్షన్ కి రమ్మని” అడిగేడు మాధవ్. “అవును మధూ.. చెప్పింది.నువ్వు
వెళతావా? ఎలావెళ్దాం?” తేరుకొని అడిగింది. “చాలామంది కార్లలో
మినీవేనుల్లో వస్తున్నారు‌. కమాన్ కేంటీన్ లో లంచ్ చేస్తూ ప్రోగ్రామ్ డిసైడ్ చేద్దాం” అన్నాడు మాధవ్.

ఉష మాధవ్ కి సీనియర్.
మంజులని మాధవ్ నీ చాలా ఇష్టపడుతుంది. ప్రేమికులుగా వాళ్ళు
ఎంత డీసెంట్ గా బిహేవ్ చేస్తారో ఉషకి బాగా తెలుసు.

💄💄💄💄

ఉష కొడుకు బారసాల ఘనంగా జరిగిపోయింది. వచ్చిన అందరూ
వెళిపోయేరు. ఉష బలవంతం మీద
మాధవ్ మంజులా మరో గంట కూచున్నారు. కాఫీలు తాగి వెళ్ళమంది
ఉష. ఇంతలో చంటివాడు ఏడుస్తూ ఉంటే, ఉష లోపలకి వెళ్ళింది.

మాధవ్ మంజులా ఉషా వాళ్ళ గార్డెన్ లో కూచున్నారు.

లేత నీలం‌ పట్టుచీరలో, తలంటుకున్నబకురులు ఎగురుతూ ఉంటే మంజుల అందం మరీ మరీ ఎక్కువగా ఉంది.

“మంజూ గురుతుందా.. వచ్చేవారం ఏమిటో…” మాధవ్ అడిగేడు.

“ఎందుకు గురుతు లేదు. నీ పుట్టినరోజు కదూ… ఎలా మర్చిపోతాను? మంజుల నవ్వుతూ ఉంటే చక్కటి పళ్ళవరస
మెరిసిపోయింది.
“మరి నా పుట్టినరోజుకి ఏం గిఫ్ట్ ఇస్తావ్?” ఆమె వేపే తదేకంగా చూస్తూ
అడిగేడు మాధవ్.
“ప్రతీ ఏడూలాగే నీకు ఇష్టమయిన బుక్… ఓకేనా” అంది మంజుల.

“ఊఁహూఁ. ఈ సంవత్సరం వేరేగా
ఉండాలి.”

“అయితే ఏం కావాలో నువ్వే అడుగు?”
అంది మంజుల

“నువ్వే కావాలి. నా పుట్టినరోజునాడు
ఇద్దరం ఔటింగ్ కి వెళదాం. ఓకేనా”

మంజుల ఉలిక్కిపడింది. తీయటి భావాలు. కొంచెం భయంతో జవాబు
చెప్పలేకపోయింది.
“చెప్పుమరీ.. ” మాధవ్ మంజుల చెయ్యి
పట్టుకొని అడిగేడు.

మంజుల మొహం ఎర్రగా చేసుకొంది. ఇంతలో ఉష వాళ్ళని వెతుక్కుంటూ
వచ్చింది.

మర్నాడు:
మంజుల మాధవ్ చేతిలొ ఓ కవరు పెట్టి అక్కడనించీ వెళిపోయింది.

“మధూ డియర్….
వెరీ వెరీ సారీ…. నీ ముచ్చట తీర్చ లేకపోతున్నాను. నీ సరదా కాదంటున్నాను. మెడిసన్ చదివినా..
నేను ఓ సగటు ఆడపిల్లనే. నా లేత
మనసూ తనువూ సంప్రదాయకంగా
పెళ్ళి తరవాత నీ చేతిలో ఉంచుతాను. ఆరోజు మధురానందం కోసం కొంచెం ఆగుదాం. ఇవాళ కోపం వచ్చినా, కొన్నాళ్ళు పోతే ‘నేనే రైటు’ అని
అంటావని నమ్మకం నాకుంది.”
సదానీ ……… మంజు.

మాధవ్ పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి. ఒక గంట తరవాత
మంజుల చేతిలో ఓకవర్ ఉంచేడుమాధవ్….

భయపడుతూ విప్పింది
మంజుల.

” మంచి అమ్మాయి మంజూ…. ఎప్పటికన్నా ఎక్కువ నచ్చేవ్.‌
మరీ మరీ మరీ ఇష్టంగా ఉన్నావ్. లేకపోతే ఎంత ప్రేమికుడయినా పెళ్ళికి ముందే ‘నాతోరా’ అన్న తుంటరి కోరిక మగాడు కోరితే అమ్మాయి
వద్దనడమే అందం. మురిపంకూడా.
నువ్వే రైటని ఇప్పుడే అంటున్నాను.
నా తుంటరి కోరికని మన్నించు. మరచిపో……
విత్ లవ్ యువర్స్ మాధవ్”
కేకపెట్టాలన్న ఆనందం వచ్చేసింది మంజులకి.

“సారూ ఒక్కసారి ఇలా వినండి” మంజుల పిలిస్తే మాధవ్ వచ్చి “ఏంటి
మేడమ్.. ఈ రోజు డ్యూటీ లేదా?”
అన్నాడు.

“పెద్ద డ్యూటీ ఇంటి దగ్గర. మీ పుత్ర రత్నం ప్రణీత్, మీ ఫ్రండ్ రత్నాకర్ గారి
అమ్మాయి హాసిని‌ని ప్రేమిస్తున్నాడట.”

“ఓహ్ వాట్ ఎ వండర్ఫుల్ సెలెక్షన్” మాధవ్ ఆనందంగా అన్నాడు.

“అంతటితో అయితే ఫరవాలేదు. నిన్న ఫోన్ చేస్తూ ఉంటే విన్నాను.
హాసినిని ఔటింగ్ కి రమ్మని ఫోర్స్ చేస్తున్నాడు. అన్నీ అయ్య పోలికలే…” మూతి సున్నాలా
చుట్టి అన్నాది మంజుల.

“డోంట్ వర్రీ డియర్.. ఓ తరం అయిందిగా.. నేను టేకిల్ చేస్తానులే” నవ్వుతూ మంజుల భుజంమీచెయ్యి వేసి హామీ ఇచ్చేడు మాధవ్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!