కష్టం సుఖం

అంశం: చీకటి వెలుగులు

కష్టం సుఖం

రచన: శిరీష వూటూరి

పుట్టుక వెలుగు
గిట్టుట చీకటి
జీవితం చీకటి
వెలుగుల సంగమం.

చిమ్మ చీకటికి భయపడితే
చంద్రుడు వెలుగు ఎలా పంచగలడు
అరుణోదయ సూర్యుడికి అలుపోస్తే
జగతిని  ఎలా మేల్కొలపగలడు

కష్టం సుఖాల కలబోత జీవితం
మనసులో మన అనుకున్నవారు
సుఖంలోను  తోడుంటారు
కష్టంలోనూ  వెన్నుతడతారు..

చీకటివెలుగుల పండగ దీపావళి
చీకట్లను చీల్చుకంటూ దీపాల
వెలుగును పంచుతూ జీవిత
సారాన్ని చెప్పకనే చెపుతుంది
ఈ పండగ..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!