సుఖ సంతోషాల వరమేలే…

అంశం: చీకటి వెలుగులు

సుఖ సంతోషాల వరమేలే…

రచన: జీ వీ నాయుడు

చీకటి వెలుగుల రంగేళీ
జీవితమే ఒక దీపావళీ
అంటూ ఓ సినీ గేయ రచయిత
సెలవిచ్చిన అక్షర కృతి
చీకటి మాటున దాగుండేదే వెలుగు
వెలుగు మాటున దాగుండేదే చీకటి
ఏ ఒక్కటి లేకున్నా ప్రపంచమే లేదన్నా
ఆటుపోట్లు జీవితం లో అంతే అన్నా
కష్ట సుఖాలు కావడి కుండలు
మంచిచెడులూ చీకటి వెలుగులే
అహంకారం వీడితే వెలుగేలే
గర్వం పెరిగితే చీకటేలే
హద్దు మీరితే అంతమేలే
చీకటి వెలుగులను సమం చేస్తే
ఆ జీవితమే సుఖమేలే
ఈ జ్ఞాన బోధ తెలిసినా
సుఖసంతోషల వరమేలే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!