అయోమయం రాజు

అయోమయం రాజు

రచన::జయకుమారి

తూరుపు కనుమల చిట్టి అడివిలో  మౌనీ మహర్షి ఒక గురుకులం నిర్మించుకొని ,కొంత మంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఉండేవారు.
అతని శిష్యులు కూడా గురువు గారి మాట ఎప్పుడు జవ దాటే వారు కారు.
గురువు గారి శిక్షణ లో అన్ని విధ్యలలో నైపుణ్యం పొందడం తో పాటు, క్రమశిక్షణ,వివేకం,అందరికి సాయం చేసే మంచితనం అన్ని మంచి లక్షణాలు కలిగివుండేవారు.
ఒక రోజు ధరణిికోట మహా రాజు మహేంద్ర వర్మ
కి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య నుంచి బయట పడడానికి అందరిని సలహా అడిగిన,సలహా ఇచ్చిన ఆ సమస్య తీరే మార్గం కనిపించే మార్గం కనిపించలేదు.
దేశాటన చేస్తూ ధరణిికోట కి వచ్చిన మౌనముని  శిష్యుడు చంద్రశేఖరుడు గురించి రాజు గారు తెలుసుకొని.అతని గురువు గారి శిక్షణ లో అతను సకల విధ్యలలో ఆరితేరినవాడు అని తెలుసుకొని.
అతనిని తక్షణమే రాజు గారి కోటకు రమ్మని ఆహ్వానం పంపగా, ఆ ఆహ్వానాన్ని స్వీకరించి కోటకు వచ్చిన చంద్రశేఖరున్ని సకల మర్యాదలతో సత్కరించి అతిధి మర్యాదలు చేస్తున్న రాజు గారి మొఖంలో తేడా ని గమనించిన చంద్రశేఖరుడు.
మహా రాజా మీ సమస్య ఏమిటి అని అడుగుతారు.
అస్సలు రాజు గారు ఏమి చెప్పకుండానే  అక్కడ ఒక సమస్య ఉంది అని గమనించిన  చంద్రశేఖరుని తెలివి కి మెచ్చి,ఈ సమస్య తీర్చే వాడు ఇతనే అని  నాకు నమ్మకం వచ్చింది మహామంత్రి గారు అంటూ ,నా సమస్యను ఇతనితో చెప్పుకుంటే సమస్య తీరుతుంది.
చంద్రశేఖరుడు మీ సమస్య ఏదైనా తీర్చే ప్రయత్నం చేస్తాను అని వాగ్దానం చేస్తున్న, ఇక మీరు మీ జంజాటం  నుంచి బయటకి వచ్చి అస్సలు సమస్య ఏమిటో చెప్పండి అని అడుగుతారు.
అప్పుడు రాజు గారు అస్సలు నా సమస్య కి కారణం నేనే స్వామి.
నేను ఒక రోజు  మా పరివారం తో  మా రాజ్యం ఉత్తరదిక్కున ఉన్నా అమ్మవారి గుడికి రాజ్యం క్షేమం కోసం  యజ్ఞం  చేయించడానికి వెళ్ళాము .
ఆ పూజ పూర్తి చేసుకున్నాక అక్కడ పూజారి మీ రాజ్యానికి ముప్పు పొంచివుంది అని దాని నుంచి బయటపడడానికి రెండు మంత్రించిన మూటలు ఇచ్చి ఒక దానిని రాజ్యం చివర ఉన్నా బేతాల గృహంలో ఉన్న రాక్షేసుని వల్ల రాజ్య నికి ఇబ్బంది లేకుండా అతనికి తృప్తి పరచడానికి ఇచ్చారు, మరోకటి కోట ప్రధాన ద్వారానికి కట్టమని ఇచ్చారు.
ఇంతకీ సమస్య అల్లా ఆ మూటలు రెండు ఒకే విధంగా ఉండటం వల్ల నేను అయోమయం తో రెండు మార్చి ఇచ్చేసాను.
అక్కడి తో శాతం గా ఉన్న బేతాల రాక్షసుడు నా అడ్డు తొలగించుకోవడం కోసం పూజలు చేయిస్తావా, ఇప్పటివరకు నీ మంచితనం విని నీ రాజ్యానికి ఎటువంటి హాని చెయ్యకుండా నేను ఊరుకున్న, ఏదో నా  తృప్తి కొరకు పూజారి ఇచ్చిన మూటను నువ్వు నీ రాజ్యానికి తీసుకొని పోయి నన్ను మాయ చెయ్యాలని చూస్తావ.
చెబుతా ఇక నుండి నా నుంచి నీ రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటావో నేను చూస్తా అంటూ.
ఆ రోజు నించి మా రాజ్యం మీద పడి దొరికిన వారిని దోరికినట్టు  చంపుకు తింటున్నాడు.
ఈ వచ్చే అమావాస్య రోజు నా ప్రాణాలు కూడా తీసేస్తే అని గట్టిగా చెప్పేడు.
నేను కావాలని అలా చెయ్యలేదు,
ఏదో పొరపాటున   అయోమయంలో  మూటలు మారి పోయాయి.
ఇప్పుడు నా ప్రాణాలు తో పాటు రాజ్యం కూడా చిక్కుల్లో పడింది.
దీని నుచి మిరే కాపాడాలి అని వేడుకుంటాడు.
అప్పుడు చంద్రశేఖరుడు ఒక ఉపాయం చెబుతాడు. ఆ రాక్షసుడు కి ఇష్టమైన వంటలు, ఇష్టమైన వన్ని ఎదురుగా పెట్టి అతన్ని మభ్యబెట్టి ఆ మూటను నేను తెస్తాను కానీ అతనికి శాంతి పూజ చేయించండి అని చెబుతాడు.
అలనే చేస్తాడు రాజు గారు.
అప్పటి నుచి రాజు గారు చాలా సంతోషంగా వుంటారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!