తీరిన అయోమయం

తీరిన అయోమయం

రచన: పరిమళ కళ్యాణ్

“సంజూ, ఇతను సృజన్; సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమెరికాలో మంచి కంపెనీలో పెద్ద శాలరీ డ్రా చేస్తున్నాడు. ఇతను ప్రదీప్; గవర్నమెంట్ ఎంప్లాయీ. మంచి పే స్కేల్ ఉంది. ఇద్దరివీ ఫామిలీ బాక్గ్రౌండ్స్ చూసాము. ఇద్దరూ నీకు తగ్గ వాళ్ళు. ఎవరిని సెలెక్ట్ చేస్తావో నీ ఇష్టం” అంది తల్లి శాంభవి.

వాళ్ళ ఫోటోలు చూసి, “ఇద్దరూ బాగున్నారు. ఎవరైతే బెటర్?” అని ఆలోచనలో పడింది సంజన.

సంజన చిన్నప్పటి నుంచీ అన్నిటికీ అయోమయమే. అమ్మా నాన్నా ఇద్దరూ పెద్ద ఉద్యోగస్తులే అవ్వటంతో అన్నీ తన ఇష్టానికే వదిలేశారు. ఏం చదవాలి అనుకున్నా, ఏ బట్టలు వేసుకోవాలి అన్నా అన్నీ తన ఇష్టమే అనేవారు.

సంజనకి రెండు మూడు సెలెక్ట్ చేసి పెట్టుకోవటం అలవాటు. వాటిలో చివరకి ఒకటి తన తల్లి సెలెక్ట్ చేసిన డ్రెస్ అయ్యేది, లేదా తన ఫ్రెండ్స్ ఉన్న స్కూల్ లేదా కాలేజినో అయ్యేది.

అలా ఏ విషయంలోనూ సొంత నిర్ణయం తీసుకోలేక పోయేది సంజన.

“నువ్వే చెప్పమ్మా” అంది రెండు ఫోటోలు మార్చి మార్చి చూస్తూ.

“చూడు సంజూ, ఇప్పటివరకూ అన్నీ నీ ఇష్టానికే వదిలేసాం. నువ్వు కన్ఫ్యూజ్ అయినా చివరికి మేమే ఏదొకటి సర్ది చెప్పేవాళ్ళం. కానీ ఇది అలా కాదు, ఇది నీ లైఫ్ మేటర్. నువ్వే డిసైడ్ చేసుకోవాలి!” అని చెప్పాడు తండ్రి భువన్.

“అవును సంజూ, ఇది నీ లైఫ్ కి సంబంధించిన విషయం. కాబట్టి నువ్వే ఆలోచించుకో!” అంది శాంభవి.

“అది కాదమ్మా, ఇప్పటివరకు నాకు డౌట్ గా అనిపించినవి అన్నీ నువ్వే సెలెక్ట్ చేసావు కదా, అలాగే ఇది కూడా నువ్వే సెలెక్ట్ చెయ్యమ్మా ప్లీజ్!” అంటూ బతిమాలింది సంజన.

“సురే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా, నువ్వే ఒకసారి వాళ్ళ ఇద్దరితో మాట్లాడు. నీ ఇష్టాఇష్టాలను వాళ్ళకి చెప్పి, వాళ్ళ గురించీ తెలుసుకో. అప్పుడు దాన్ని బట్టి నువ్వే నిర్ణయం తీసుకో. కానీ మంచి నిర్ణయం తీసుకోవాలి, సరేనా? బాగా ఆలోచించుకో!” అంది శాంభవి.

“సరే అమ్మా!” అంది దృఢ నిశ్చయంతో.

అమ్మ చెప్పినట్టే ఇద్దరు పెళ్ళి కొడుకులతో మాట్లాడి, తనకి నచ్చిన వాడిని, తనకి సెట్ అవుతాడు అనుకున్న వాడిని సెలెక్ట్ చేసుకుంది సంజన..ఆ తర్వాత తన జీవితంలో ఎప్పుడూ అంత అయోమయం చెందలేదు. తనకి స్వతహాగా నిర్ణయం తీసుకునే అలవాటు అయిపోయింది.

స్వస్తి

You May Also Like

One thought on “తీరిన అయోమయం

  1. చాలా బాగుంది. చెల్లి. 😄😄😄

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!