మనిషి తత్వం

మనిషి తత్వం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: శ్రీదేవి విన్నకోట

మనిషి మనిషికీ మధ్య అవసరం సమానత్వం,
మనుషులే గొప్పోళ్ళు వదిలేస్తే తమ మూర్ఖత్వం,

మనుషులు చేసే పనిలో కూడదు అలసత్వం,
మనుషులే గుళ్లో దేవుళ్ళయితే వారిది అమరత్వం,

ముసుగు లేని మనిషిగా జీవించడం సహజత్వం,
మనిషిని తరచి చూసినా తెలియదు వారి మనస్తత్వం,

ప్రతి మనిషిలో నిగూఢమై ఉంటుంది సున్నితత్వం.
ఓ మనిషి ఇతరులపై చూపించకు నీ కఠినత్వం,
ప్రతి మనిషికి అత్యంత అవసరం మంచి మానవత్వం,

ప్రతి మనిషి కులం మతం, డబ్బు దస్కం,ఎక్కువ తక్కువ,
లేకుండా గుణంతో గౌరవించ బడడమే మనిషి తత్వం.
ఇదే నేటి సమాజం మనకు నేర్పించే అరుదైన గుణపాఠం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!