ప్రేయసికో ప్రేమలేఖ!

ప్రేయసికో ప్రేమలేఖ!

రచన: ఎం.వి.చంద్రశేఖరరావు

ప్ర్రేయసీ,
నీవు కనపడవేమీ,
నీకోసం కన్నులు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాను,
ఎన్నో ఏళ్ళనుంచి
తపస్సు చేస్తున్నాను,
అమృతం కురిసినరాత్రిలా,
నిశిలో శశి,వెండివెన్నెలలా,
నువ్వు నా ఆశలన్నీ ఎప్పుడు తీరుస్తావు?
నా కంటివెంట కన్నీరు ధారలు కడుతోంది,
హృదయం బరువెక్కుతోంది,
గుడికివెడితే పసిబాలలు
చిరిగిన బట్టలతో,
చేతులు చాస్తున్నారు,
రైల్వేస్టేషన్ కు వెడితే
ఎండిపోయిన డొక్కలు
ఎదురుపడుతున్నాయి,
పేపరుతెరిస్తే అమ్మాయిల మీద అఘాయిత్యాలు,
యాసిడ్ పోసిన సంఘఠనలు ఎక్కువైవుతున్నాయి,
టీవీచూస్తే నాయకుల
అక్రమాలు,అన్యాయాలు
పెచ్చుమీరుతున్నాయి,
ఓ ప్రజాస్వామ్య నా ప్రేయసీ,
ఓ సోషలిజం  దేవతా,
పుట్టిన దగ్గరనుంచి నీనామమే జపిస్తున్నాను,
నాకు ఎప్పుడు కన్పిస్తావు?
నా భారతప్రజల కన్నులలో
ఎప్పుడు ఆనంద కాంతిపుంజాలతో దీపావళులు వెల్గిస్తావు?
ఇట్లు నీ ప్రేమికుడు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!