నిరాడంబరుడు

నిరాడంబరుడు

రచన :చంద్రకళ ధీకొండ

పొట్టివాడైనా గట్టి మనసున్నవాడు…
సొంత ఇల్లు ఎరుగని నిరాడంబరుడు…
నిబద్ధతకు నిలువెత్తు రూపం…
నిజాయితీకి నిఖార్సయిన నిదర్శనం…!
ఐదు రూపాయలు ఇవ్వలేక…
వీపుపై పుస్తకాల మూటను మోస్తూ గంగానదిని ఈదిన దృఢనిశ్చయుడు…
ఐదు రూపాయల నాణంపై బొమ్మై నిలిచాడు…!
ఢిల్లీలో పచ్చిక మైదానం దున్నిన శ్రామికుడు…
“జై జవాన్…జై కిసాన్”అంటూ నినదించినాడు…!
జరిగిన ప్రమాదానికి జవాబుదారీగా రాజీనామా చేసిన రైల్వే మంత్రి…
ప్రపంచ శాంతికి పాటుపడిన
హోం మంత్రి…!
ఒక్క రూపాయి జీతం తీసుకొని…
సంపాదించిన ఆస్తులేవీ లేకపోయినా…
దేశం నిండా అతని పేరున్న రహదారులు,భవనాలు, విగ్రహాలతో…
తరగని కీర్తిని సంపాదించిన యశోమూర్తి…!
లాఠీచార్జి కి బదులు
వాటర్ జెట్ ను ప్రవేశపెట్టిన ప్రజాపక్షపాతి…
మొదటి మహిళా కండక్టర్లను నియమించిన సంస్కరణవాది…!
వారంలో ఒకపూట
భోజనం మాని
పేదలకై పాటుపడిన ఆదర్శవాది…
కుమారుని కోరికపై కొన్న
కారు అప్పు తీర్చుటకై వచ్చిన వందలాది మనీ ఆర్డర్లను తిరస్కరించిన సహధర్మచారిణిని పొందిన ధన్యజీవి…!
సామ్యవాద ప్రజాస్వామ్యం,
సర్వ దేశాల మైత్రిని కాంక్షించిన
శాంతిదూత శాస్త్రీజీ…
అగ్ర రాజ్యాల కుట్రకు బలైపోయిన
భారతరత్న శాస్త్రీజీ…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!