నీలో నేనుగా

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)

నీలో నేనుగా

రచన: జో

వేసే ప్రతి అడుగులో
నీవు మిగిల్చి వెళ్లిన
గతకాలపు జ్ఞాపకాల్లో
పరిమళాలను మళ్ళీ
అద్దుకుంటూ నన్నునేను
నీకు దగ్గరగా చేస్తున్న
నీకు దూరంగా ఉన్నా
అనుకుంటూ నీనుండి
దూరమై క్షణం నుండి
ప్రతిజ్ఞాపకం ప్రతిక్షణముతో
పోటీపడిన ప్రతిసారి
నీవే గెలిచి అడుగడుగునా
నీవు విజయం సాధించిన
నీవు లేని భ్రమలో ఉన్న నాకు
నీవు ఎక్కడలేవు
అని నా మనసు అంతరంగంనుండి
నాకు విసిరిన ప్రశ్నకు
సమాధానము ఏమని
చెప్పను…నేనుగా
నీవు నాలో లేవు
నేనే నేనులో లేను కనుక
నీలో నేనుగా నీతో ఉన్నా..

You May Also Like

One thought on “నీలో నేనుగా

  1. …నీలో నేనుగా నీతో వున్నా మంచి ముగింపు. బాగుందండి 🙏👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!