(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)
నిన్ను నీవు శోధించుకో
రచన: జయ
జవాబు లేని ప్రశ్నల్లే మిగిలిన నిన్ను.
నువ్వే ప్రశ్నించుకో
ఎందుకు నువ్వు నీలా లేవో
నిన్ను నువ్వే ప్రశ్నించుకో
ఆశలు రెక్కలు తొడిగి సీతాకోకచిలుకల
ఎగిరిన నీవు.
నీ రంగులన్ని ఏ చీకటి కి ధార పోసావో
గుర్తుచేసుకొని
నిన్ను నీవు ప్రశ్నించుకో
నీలాకాశంలో వెన్నలమ్మవై వెలుగులు పంచే నీవు
మిసిమి లో మిసిమివై
ఆ చంద్రునిపై మచ్చల ఎందుకు మిగిలిపోయావో
నిన్ను నువ్వు ప్రశ్నించుకో
చిరునవ్వులకే చిలిపితనం అద్దిన
నీ చిరునవ్వును
ఏ కన్నీటి చితికి ఆహుతి ఇచ్చావో
నిన్ను నీవు ప్రశ్నించుకో
ప్రశించుకో నిన్ను నీకు
తిరిగి ఇచ్చేవరకు ప్రశ్నించుకో
శోధించు, సాధించు ,శాశించు
నీ పట్టుదలనే శరం గా సంధించు
భూకంపాలే రాని
సుడిగుండాలే సృష్టించని.
పెను ఉప్పెనే రాని
ఏదైనా కానీ,ఏమైనా రాని.
నీలో ఉన్న ఆత్మస్థైర్యం నే
ఆయుధంగా మలుచుకో
నీలో ఆశనే ఆయువుగా మార్చుకో.
నీ అంతరంగాన్నే ప్రశ్నించు,పోరాడు
అలలై ఎగసిపడు.
ఆ సంద్రాన్నే సాక్ష్యం గా నిలబెట్టు
నీ గమ్యం,నీ సంతోషం సాధించి
ఆకాశంలో ధృవ తారల నిలిచిపో నీలా
***********
Wow.. సూపర్ జయా..👏👏👏. చదువుతుంటే చాలా మంచి కవిత చదివాను అన్న అనుభూతి కలిగింది👌👌👌 ఆలోచింప చేసే విధంగా ఉంది మీ కవిత థాంక్యూ ఇంత మంచి కవితను మాకు అందించినందుకు❤️❤️