(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)
అంతరంగం ప్రశ్నిస్తే
రచన: బుదారపు లావణ్య
అంతర్ముఖుడై
అంతరాంతరాల్లోకి
తొంగి చూడగా
నా మనోఫలకపై
మెదిలే చిత్రాలు
నన్ను నిలదీయగా
నేను నేను కాదు
అనుబంధాల వలలో
చిక్కుకున్న చేపపిల్లలా
ఈర్ష్యాద్వేషాల
మాయ మోసాల
నడుమ విలవిల్లాడుతూ
కరిగిపోతున్న కాలాన్ని
ఒడిసి పట్టలేక
ఒరిగిపోతున్న వ్యక్తిత్వాన్ని
నిలబెట్టుకోలేక
గెలుపు ఓటముల
దాగుడుమూతలాటలో
బందీగా మారి
వెలవెలబోతున్నా
నా వర్తమాన జీవితంలో
వెలిగేటి వెలుగురేఖలకై
అంతర్ముఖుడై పరితపిస్తూ.
********
…. అంతర్ముఖుడై పరితపించిన ముగింపు బాగుందండి