కళను నేను!!

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)

కళను నేను!!

రచన: సూర్యదేవర స్వాతి

కళను నేను….
నా అంతరంగం ఇది…
నాతోనే జీవనము అనుకునే వారు కొందరు….
నాతో కలిసి బ్రతికి, నన్ను బ్రతికించేవారు ఇంకొందరు….
నేను వారితో  ఉన్న నన్ను నిరూపించుకోలేక భాధపడేవారు మరికొందరు….
నన్నే చూపించి ఆకట్టుకునే వారు కొందరు….
నేను వారితో లేకపోయినా నన్ను బయటకు రప్పిస్తా అని  మోసగించేవారు ఇంకొందరు…
నేను చచ్చిపోతున్న అని ఏడ్చేవారు కొందరు..
నన్నే చంపేసేవారు మరికొందరు…
నాలో నుండి ఉద్భవించిన ఇంకొన్ని కొమ్మల సమూహానికి ప్రాణం పోసేవారు కొందరు….
ఆ కొమ్మల సమూహాన్ని నరికేసేవారు ఇంకొందరు….
పదిమందికి నా ఉనికి చెప్పాలి అని అతృతతో కొందరు….
నా ఉనికిని పూకటివేళ్ళతో పెకిలించెయ్యలని ఇంకొందరు….
నేను బాసటగా,ఆసరా గా బ్రతికే వారు కొందరు….
నన్ను చూపించి ఉచ్చు బిగించే వారు ఇంకొందరు…
నేను ఉచ్చుని కాదు అని చెప్పాలని నాకు ఉన్నా ,నా నోరు నొక్కేవారు మరికొందరు….
వీరి తీరు మారదు…నా నోరు పెగలదు..

నాకు న్యాయం చేసేదెవరు!? నన్ను కాపాడేదెవరు!? ఎన్నాళ్లీ వేదన!?
సమాధానము దొరికేదెన్నడు!?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!