హృదయస్పందన

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)

హృదయస్పందన

రచన: సురేఖ దేవళ్ళ

అంతరంగాన్ని ప్రశ్నిస్తే
మదిమాటున దాగిన
జవాబు ఇవ్వలేని ప్రశ్నలన్నీ
ఉప్పెనలా దాడిచేసే
కలత నిదురోతున్న మస్తిష్కం పై..
మనసులు చేసిన విన్యాసాలకు
చేయూతనివ్వలేక, ఎదురుదాడి చేయలేక
సతమతమైన ఆలోచనలు
జేసెను వనవాసమే…
విశ్వాసమే పరిహాసమై
జీవితగమనమునకు బంధనమవుతున్న వేళ…
స్వార్థం ఐశ్వర్యపు ఒడిలో ఊయలలూగుతూ
మానవత్వం కడుపేదయై కటికనేలపై నిలచిన
పరిణామాలను చూస్తూ మనసు
కార్చిన కన్నీటి వీడ్కోలుకు
స్తంభించదా హృదయస్పందన.

 

You May Also Like

One thought on “హృదయస్పందన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!