రెక్కలు విరిగిన పక్షి
రచన: సుజాత కోకిల
పున్నమి వెన్నెల లాంటి వెలుగులో
ప్రకృతి శోభా మాయంగా కనిపిస్తూ
మనసును ఆహ్లాదపరుస్తుంది
చెట్ల గాలి పలకరిస్తున్నట్టుగా
స్వాగతం పలుకుతున్నాయి
ప్రకృతి ఎంత అందంగా ఉన్నా
మనసంతా ఏదో చెప్పలేని బాధ
ఊరట లేని జీవితం చుట్టూ చీకటి
మంచి చెడ్డల మధ్య మనసు
ఊగిసలాడుతూ విచక్షణ జ్ఞానాన్ని
కోల్పోయేలా చేసింది అగాధం
వెలవెలబోయిన జీవితం కాల చక్రంలో ఒక ప్రశ్నలా.మిగిలింది
జీవితం ప్రవాహంలా కొట్టుకుపోతుంది
ఆకాశం వైపు చూస్తున్న నాకు
చంద్రుడి లో మచ్చ కనబడింది
నా జీవితం కూడా చంద్రుడిలో మచ్చలా ఉంది
చిగురించే జీవితం కొరకు ఒంటరినెై ఎదురు చూస్తున్న దీనురాలిని
……………………….