జీవితం
రచన: చెరుకు శైలజ
బతుకు బతికించు
నవ్వు నవ్వించు
పువ్వు లా వికసించు
మౌనం పాటించు
నీ కొరకు జీవించు
మంచి పనులు చేసి చూపించు
నిత్యం భగవంతుని పూజించు
దేవుని సన్నిధిలో పరవశించు.
అందరిని ప్రేమించు
పెద్ద వారిని పిల్లలాగా లాలించు.
చెడ్డ వారిని ఓర్పుతో భరించు
ప్రకృతిని ఆరాధించు
జీవరాసుల పట్ల కరుణ కురిపించు
అన్యాయాన్ని ఖండించు
నీతితో జీవనం సాగించు
ప్రతినిత్యం ఆనందంగా నివసించు.
ప్రశాంతంగా జీవితాన్ని ఆస్వాదించు
అన్ని సద్గుణాలతో
మనిషిగా నీ జన్మ తరించు