మీరు మనుషులై…
రచన: గాజులనరసింహ
అవినీతికి ఆజ్యం పోస్తున్నా అసమర్ధపు అధికారాలు దొంగలు దొరలై చేస్తున్నా రాజకీయాలు ఆలోచనకు అంతుపట్టని మరోభారత పర్వాలు కలియుగ అంతానికి మార్గదర్శకాలు మానవబంధ విచ్ఛిన్నతకు నిలువెత్తు సాక్ష్యాలు.
నాడు తెల్లవాళ్ళు పీడితులని తరిమితే.. నేడు స్వదేశీయులే
భకాసురులై దేశాన్ని మానవతా విలువలను అతలాకుతలం చేస్తున్నారు.
అభివృద్ధి పేరుతో ఎన్నో పల్లెలు పతనం అవుతున్నాయి,
కొండలు బండలు కనుమరుగు అవుతున్నాయి. జంతుజాలాలు నశించి పోతున్నాయి. పచ్చని వర్ణాలతో.. పురుడు పోసుకొంటున్న ఆమని వనాల వికటతలో.. కడుపుకోతతో విలవిలపోతుంది.
మనిషికి నేడు విజ్ఞానంతో జ్ఞానం పెరుగుతుందో… లేక అజ్ఞానం పెరుగుతుందో!? అర్థం కాని పరిస్థితి నేడు నెలకొంది. దురాశల స్వార్థపు దాహం తీరనిదై నీడలా వెంటాడుతోంది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది.
మార్పు ఎలా రావాలి ఎవరితో రావాలి..? అవినీతి పరులకు కొమ్ముకాసే అధికారత్వం ఎపుడూ పోవాలి..? అది ఎలా నశించాలి.. రంగులు వేసి ఫ్లేక్సీలు కడితే, బిరియానీలు పెడితే సమాజం మారుతుందా.. వర్గాలను, కులాలను, మతాలను, బలాలను అనుసరిస్తూ డబ్బులు ఇస్తే మనిషి మారునా..? సమాజం మారునా..?.
మార్పుకు మాలం అధికారం. అధికారానికి మూలం ఓటు,
ఆ ఓటు అవినీతికి అధికార దుర్వినియోగుల అహంకారానికి పోటు కావాలి. ఆ పోటుకు మూలకం మనిషికి చేతన్యం రావాలి నిష్పాక్షకుడై ముందుకు అడుగు వేయాలి. అపుడే సమాజం మారుతుంది అసమర్థత అధికారం పోతుంది ఆమని పులకించి, విశ్వము వికసించేలా జగతి మురిసిపోతుంది..
కదలండి మనుషులై ప్రతి మనిషి.. వెలగండి దివిటై నలుదిక్కుల ప్రాపంచిక సంక్షేమం ఎరిగి…
.