మా మంచి మామయ్య

మా మంచి మామయ్య

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

చెల్లి పోయి మూడు నెలలు ఆయిన తరువాత మేన కోడలు కళ్యాణి ని ఒకసారి చూద్దామని హైదరాబాద్ లోని పద్మారావు నగర్ వెళ్ళాను. కళ్యాణి పెళ్ళయి ఏడు సంవత్సరాలు అయింది. ఆరు సంవత్సరాల కొడుకు ప్రభాస్ ఒకటవ తరగతి తరువాత మూడు సంవత్సరాల మనస్విని నర్సరీ ఒకే స్కూలులో చదువుతున్నారు. భర్త ప్రదీప్ డి.ఆర్.డి. ఒ లో శాస్త్రవేత్త.

చెల్లి లక్ష్మికి కళ్యాణి ఒకతే కూతురు. అది పుట్టిన ఏడాది కి భర్త పోతే తానే పిల్లని పెంచి పెద్ద చేసి పెళ్ళి చేసింది. ఎప్పుడు నా సలహా అడిగేది. నాకు ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్ చదివి అమెరికా లో స్థిరపడ్డారు. నేను వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో నలభై ఏళ్ళు పనిచేసి ప్రొఫెసర్ గా పదవి విరమణ చేసి ఐదు సంవత్సరాలయింది.

నాకు కళ్యాణి కూతురు లాంటిది. చిన్నప్పటినుంచి మామయ్య అంటూ చేరిక. మా ఆవిడ ప్రమీలకి ఆడపిల్ల ముచ్చట ఆమె ద్వారా చూసుకునేది. మా ఆవిడే ‘మూడు నెలలయింది మీ చెల్లిపోయి అప్పుడే వెళ్ళాము తల్లి తండ్రిలేని పిల్లని చూడాలి’ అంటే హైదరాబాద్ వచ్చాము.

రా మామయ్య, రా అత్తయ్య అని ఆప్యాయంగా దగ్గరకు వచ్చి బావలిద్దరు బాగున్నారా! ఫోనులొస్తున్నాయా! అని అడిగింది. అందరు బాగున్నారమ్మా! నీవు బెంగతో చిక్కి పోయావు. మేమున్నాం కదా నీలో మీ అమ్మని చూడాలని వచ్చాము. మామయ్య ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తారమ్మా అని మా ఆవిడ అంది. వెంటనే మీరే నాకు కొండంత బలం అత్తయ్య అని ఆప్యాయంగా చేతులు పట్టుకుంటే మా ఆవిడ కనుల వెంట కారిన కన్నీటిని నే గుర్తించాను.

అపుడే స్కూల్ నుంచి చిన్న బస్తాను తలపించే స్కూల్ బ్యాగ్ ను వసారాలోనే పడేసి తాతయ్య, నానమ్మ అంటూ ప్రభాస్, నన్ను, మా ఆవిడని పట్టుకుని నాకేం తెచ్చారు అనగానే కళ్యాణి కోపంతో వీడికి సిగ్గు లేదు అని కసరితే మా ఆవిడ అదేమిటి చంటివాడు పరాయి వాళ్ళమా! ఏమిటి? అని సంచిలోని రెండు బంతులు, చాకలెట్ బాక్స్, టెడ్డిబేర్ బొమ్మలు నీకు, చెల్లికి అంటూ ఇస్తే ఎందుకివన్నీ మామయ్య అంటే అదేమిటి నీవు నా కూతురివే కదా అమ్మ అంటే మామయ్య అని దగ్గరికొచ్చి అమ్మ లేని లోటు తల్లో మేనమామో అన్నది అక్షర సత్యం చేస్తున్నారు అంది.

ఒరే ప్రభాస్ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారా అంటే ఇచ్చారు నాకు సెకండ్ ర్యాంక్ అని నవ్వుతు చెబితే కోపంతో కళ్యాణి సుందర్ కే నా ఫస్ట్ ర్యాంక్ అంటూ టి.వి.సెల్ చూస్తే ఇలాగే వస్తాయి అని వాడి నడ్డి మీద రెండు వేసి నాతో మామయ్యా ఇది వీడి చదువు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఈమధ్య టి.వి, సెల్ వద్దన్నా చూస్తున్నాడు అన్నది. వెంటనే అమ్మా నాకు కాఫీ ఇస్తావా అంటే సారీ ఇప్పుడే ఇస్తాను డికాషన్ సిద్ధంగా ఉంది అని వంటిట్లోకి వెళ్ళి ఐదు నిమిషాల్లో కాఫీ తెచ్చినపుడు నేను కూర్చో నే చెప్పింది విను అన్నాను.

అమ్మా ఏమనుకోకు నలభై ఏళ్ళు అధ్యాపకునిగా చేశాను అనుభవంతో చెపుతున్న
వాడి పనులు వాడే చేసుకోలేని చిన్న వయస్సు అసలు ఒకటో క్లాస్ కి రాంక్ ఏమిటి ఇప్పుడే వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసాను వాడికి మొదటి రాంకు వాడికి రెండు మార్కులు తేడా అయినా రాంకు కి తెలివితేటలకి సంబంధం లేదు. ఆడే పాడే వయస్సులో బాల్యానికి వాళ్ళని దూరం చేయకు మేము పల్లెటూరు లో చడవలేదా చదువు.. చదువు.. అని ఎవరూ చెప్పలేదే పెద్ద చదువులు చదివి దేశ, విదేశాలు వెళ్ళలేదా!? అలా అని వారిని ఒక కంటకని పెట్టి ఏం చేస్తున్నారు చూడాలి. అంతేకాని బాల్యాన్ని దూరంచేయకమ్మా అనగానే కళ్యాణి ఒరే కన్నా ఇలా రారా అనగానే ప్రభాస్ తల్లి దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా మెడచుట్టు చేతులు వేసి అమ్మా నేను బాగా చదువుతానమ్మా కౌగలించుకున్నాడు. అపుడు కల్యాణి నాతో మామయ్య ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడు రాకపోతే దెబ్బలాడాను ఎప్పుడు ఇలా చేయను మా మంచి మా మామయ్య అని నా చేయి పట్టుకుంటే శతమానం భవతి. ధీర్గ సుమంగళి భవ అని మనసారా ఆశీర్వదించాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!