అభిసారిక

అభిసారిక
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన తరుణం ఆసన్నమయ్యెనని
ఎదపై లాలించిన ప్రేమ గానం వాస్తవ రూపంలో దరిచేరెనని
ఉర్రూతలూగించిన ఊహలతో తేలియాడ
ఓ మేఘమా ఏం చేశావు పుష్ప వర్షం కురుస్తూ
హర్షం వెలిబుచ్చాల్సిన సంతోష తరుణంలో
తగుదునమ్మాయంటూ వేంచేసి అదను చూసి
కాపు కాసే లక్ష్మణ రేఖ చందంబున
కట్టడి చేయ సంకల్పించి సర్వశక్తులూ ఒడ్డి
లక్ష్యాలు నిర్ణయించి నిర్దయతో నిలువరించ
నీకు తగునా రెప్పల మాటున రెటీనా ఆవల
స్థిరముగా నిలిచిన నా చెలికానితో
చేరు సమయమని సంబరముతో
ఎదురుతెన్నులు చూస్తూ
కన్నుల జ్యోతుల కాంతుల వెలుగులు ముంచేయగా
మబ్బుల తేరుపై విహరిద్దాం అని తలచి,
అభిసారికలా అలంకృతనై మధురోహలతో
తేలి ఆడుతూ మదిలో తీయని తలపుల నిండగ
తలుపుల చేరిన నన్ కన్నను దయలేదా.
కోరిన రేడును పొందగోరిన నా తప్పిదంబేమి తెలుపుమా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!