90 డిగ్రీల పర్యవసానం

90 డిగ్రీల పర్యవసానం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

ఒరే సుడండ్రా! నా కొడుకు
బడి సదువుల్లో పాసయ్యిండు,
90 మారుకులు వొచ్చినాయే
గొప్ప కదరా! అన్న తండ్రి ఆనందం.
‘ఓరోరే, మళ్ళీ వచేసినాది,
90 మారుకులు కళాశాల సదువుల్లో!!
ఊరంతా సెప్పాల్రా, అన్న తండ్రి అమితానందం,
‘ఒలే, ఒరే! అందరూ ఇనండిరా, నా కొడుకు
అదేదో పట్టా పుచ్చుకొని
‘కర్రి కోటు’ ఏసుకొని రాజా
మాదిరి, చాకిరీ కి పోతాడు అంట,
‘ఏడాది తర్వాత ఒరే అయ్యా, పని పాట లేదే,
ఉద్యోగాలు రావట్లే,
పోనీ సేపల వేటకు పొదామంటే,
వలకి, నావకి డబ్బు లేదు కదయ్యా!
సంద్రం లో పని సేద్ధామంటే
తుఫానులు సంపుతున్నాయే,
ఒరే అయ్యా! నన్ను శమించరా,
ఇప్పుడు కూడా సెప్పరా అందరికీ
నీ కొడుకు90 ఏసుకొని
మత్తు లో సంద్రపు ఇసుకలో తొంగున్నాడు అని
“కొప్పడకు అయ్యా! మంచి
రోజులు ముంగనున్నాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!