కొత్త కోడలు వంటకాలు

కొత్త కోడలు వంటకాలు

నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయం పల్లెలో ఎంతో అందంగా ఉంటుంది

ఇంటి ముందు ఎన్నో అందాలు ముత్యాల ముగ్గులు పచ్చని గడపలు ఎర్రని చుక్కలు మామిడి తోరణాలు ఎప్పుడు స్వాగతం పలుకుతాయి

పూర్ణ ఉదయాన్నే లేచి పట్టు లంగా కట్టుకుని పూల జడ వేసుకుని నగలు పెట్టుకుని
మామ్మ గారి ఇంటి నుంచి అమ్మమ్మ ఇంటికి వెళ్ళేది

దారిలో బంధువులు ఇళ్ళ వాళ్ళు మా ఇంటికి రా మాఇంటికి రా అంటూ పిలిచి కాజ లడ్డు పూత రేకు మినప సున్ని పెట్టేవారు పూర్ణ బంగారు బొమ్మల బొద్దుగా ఉండేది అందరూ మెచ్చుకునే వారు దీనికి తోడు పాటలు పాడేది

ఐదవ తరగతి లో తాత గారికి తెలవ కుండా రాణి పద్మిని వేషం వేసి మాస్టారు తో పాటు
ఎద్దుల బండిపై పట్నం స్కూల్ కి వెళ్లి నాటకం వేసి సాయంత్రానికి వచ్చింది

ఇంట్లో తల్లికి తప్ప ఎవరికీ తెలియదు తాత గారు ఒక ప్రక్క ఐదవ తరగతి కాగానే పెళ్లి చెయ్యాలని ఆశపడేవడు
పూర్ణ మాత్రం అందరినీ మాటలతో కవ్విస్తూ ఉండేది

ఈ బంగారు బామ్మ ఎవటింటి కోడలు అవుతుందా అని అంటూ ఉండేవారు

ఆ మాటలకి నవ్వు కొనేది
తల్లి మాత్రం అడపిల్లవి అత్తింటికి వెడితే.పిల్ల ముద్ద పని ముద్ద అంటారు
వంట నేర్చుకొనే అనేది
ఆ మా అత్తింటికి వెడితే నేను వంట మనిషికి కూడా పట్టు కెడ తాను అనేది

వంట మనిషిని సరుకులతో పాటు సారే పెట్టాలి అని అందరూ నవ్వే వారు

ఊళ్ళో సంబధం ఎది కుదర లేదు కట్నాలదగ్గర గొడవ వచ్చేది
చదువు తక్కువ వాడికి పిల్లను ఇంత కట్నం ఇచ్చి ఎందుకు?అని మానేశాడు తండ్రి రామయ్య

చివరకి ఐపి ఓస్ చదివిన పోస్టల్ పోస్ట్ మాస్టర్ చేసే వ్యక్తి
బాగా ఆస్తులు ఉన్న వారిని ఎంపిక చేసి దూర బంధుత్వం.కూడా కలిపి
పెళ్లి చేశారు మాకు కట్నం వద్దు లాంఛనాలు చాలు అన్నారు

సరే పెళ్లి అయ్యింది అతైంటికి కార్లో తీసుకెళ్లి దింపారు ఘనంగా గా సారే చీర పెట్టారు
కూడా వంట మనిషిని పంపలేదు

ఎందుకంటే ఆ ఇంట్లో కోడళ్ళు పని. మెంతులు మిగిలిన వాళ్ళు ఆడపడుచులు అంతా కూడా అయితే ఎవరి. భర్తకి వారు పెసరట్టు దోసె పురి చపాతీ వంటివి చేసుకుని పట్టుకెళ్ళి పెడతారు
ఒక్కళ్లే వండి ఉంచరు అది వారి పద్దతి ఎవరు తిన్న వారు భర్తలకు చక్కగా వేడి వెచ్చా చేసి పెట్టు కుంటారు
అయితే పుర్ణకి పెసరట్టు వెయ్యడం రాదు

అంతా కలిసి నీ వంతు నువ్వు చేసుకో ఉంటూ పెసర పిండి గిన్నె గరుటీ ఇచ్చింది
అప్పట్లో కుంపటి పై అట్టు వెయ్యాలి ఇంకేమీ ఉంది పెసరట్టు పెనం పై వేసి అది ఊడి రాక పెనం చుట్టు అట్లకాడ పెట్టుకుని తిరిగింది
ఏ ప్రక్క నుంచి తిప్పినా పెసరట్టు రాలేదు నూనె వెయ్యండి వస్తుంది వదిన అని చిన్న అడబడుచూ సలహా ఇచ్చింది దాంతో నిళ్ళ ల్లా చిన్న కప్పుడు నూనె పోసింది
అయనప్పటికినీ పెసరట్టు రాలేదు ఎలాగో మూడు ముక్కలు లాగ. ముద్ద లాగ తీసి పళ్ళెంలో పెట్టింది

ఇది భర్త గమ నించి అమ్మ దాని చేత వంట పనిలోకి పంపకం డి మీరెవరో వేసి పెట్టండి అన్నాడు

అత్తగారు చూసి అయ్యి నువ్వు జమీందారు ఇంటి నుంచి వచ్చాను వంట వాళ్ళు ఉంటారు ఉద్యోగం ఊరిలో మాకు పనులు అలవాటు
సరే నేర్చుకో వచ్చును నువ్వే వేయ్యాక్కర లేదు అంటూ ఆవిడ గబ గబ నాలుగు అట్లు వేసి ఇద్దరికీ చెరో రెండు పచ్చడి వేసి పెట్టింది

ఆ తరువాత ఇంటిల్లి పాది వదిన గారి వంట ప్రతాపానికి తెగ నవ్వు కున్నారు

మరో సారి అత్తగారు ఊరికి వెడుతూ తోటి కోడలికి పని అప్పా చెప్పింది

అమె తెలివిగా పిల్లాడు ఏడుస్తున్నావు నువ్వు చెయ్యి పచ్చడి అని చెప్పింది
ఓస్ ఇంతేనా అనుకుంటూ గోంగూర శుభ్ర పరచి కడిగి ఆ నీళ్ళు పిండ కుండా రోటిలో పచ్చి గోంగూర వేసి రుబ్బింది
గిన్నెలో తీస్తుంటే జిగురుగా ఉంది

ఈ లోగా అత్తగారు వచ్చింది
పచ్చడి చేశావు ? ఎలా చేశావు నేను చెప్పడం మరిచాను అని పెద్ద కోడల్ని అడిగింది
దానికి చిన్న కోడలు పూర్ణ గిన్నె పట్టు కెళ్ళి చూపించింది

ఇదేమిటి? గోరింటాకు లా ఉంది అన్నది గోరింటాకు కాదు గోంగూర పచ్చడి అంటూ పెద్ద కోడలు కొడుకుని ఎత్తుకుని వచ్చింది

నీకు ఎన్ని సార్లు చెప్పినా పూర్ణ చేత పని చేయించ వద్దు అని చెప్పానా అన్నది

సరే అంటూ కొంగు దోపి అత్తగారు కుంపటి పై మూకుడు పెట్టీ నూనె వేసి పోపు వేయించి తీసి బండతో రోటిలో కొట్టి ఇమ్మాన్న ది.

సరే అత్తగారు అంటూ పూర్ణ పోపు పట్టుకె ళ్లి.కొట్టు కోని వచ్చింది

ఈ లోగా అత్తగారు మూకుడులో నూనె వేసి గోంగూర ముద్ద వేయించి పోపు కారం వేసి కలిపి గిన్నె లోకి మార్చి అందరినీ భోజనానికీ రమ్మని చెప్పింది కొత్త కోడలు వంటలు చాలా బాగున్నాయి

అత్తగారు మంచి ది తెలివైనది కనుక కోడల్ని కసురు కోకుం డా ప్రేమగా హాస్యంగా చెపుతూ సరి దిద్దింది

అది మొదలు పూర్ణ ఈ విషయం తన పిల్లలకి మనుమలు కి చెప్పి నవ్వుకుంటూ ఉంటారు
పూర్వ కాలం వంటలు అంటే మహా కస్టమ్ ఇప్పుడు అయితే నెట్ ఓపెన్ చేసి గూగుల్ అంటి నీ అడిగి అన్ని తెలుసుకుంటున్నారు ఈ తరం కొత్త కోడలు

పుట్టుట గిట్టుట నిజము న ట్టా నడి మ పని నాటకము అన్నట్లు జీవితం లో వంట నేర్చు కోని ఉండాలి

మనం తినే ఆహారాన్ని బట్టే ఆలోచనలు ఉంటాయి అంటారు పెద్దలు
మరి పెద్దల మాట చద్ది మూట

అయితే ఒకటి ఆడపిల్ల ఐఎఎస్ చదివిన ఇంకా పెద్ద చదువులు చదివిన సరే వంట ఇంటి పనులు నేర్పాలి అని తన మనుమలు పూర్ణ చెపుతూ ఉంటుంది

జీవితంలో ఇది ఒక హాస్య ము
ఈ తరం. పిల్లలు కి ఒక జీవిత సత్యము సంతిడు శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!