శుభమ్

శుభమ్

నారుమంచి వాణి ప్రభాకరి

ఆకాశంలో నక్షత్రాలు చంద్రునితో పోటీ పడి విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి

పెళ్లి వారి భజా భజంత్రీలు వినిపిస్తూ న్నాయి ఎంతో ఘనమైన పెళ్లి మద్రాస్ లో శరవణ కళ్యాణ మండపంలో ఎంతో ఘనంగా చేస్తున్నారు

పెళ్లి పెద్ద కౌసల్య హడావుడిగా పట్టు చీరతో అందరికీ పనులు పుర మాయిస్తొం ది

పెళ్ళికూతురి మెహంది పెడుతున్నారు ఘనంగా పెళ్లి జరుగుతోంది
ఈర్ష్య పడేవారు ఈర్ష్య పడుతున్నారు
ఇంత వయస్సులో కూడా ఇంత బాగా పెళ్లి జరుగు తోంది అని ఆశ్చర్య పడుతున్నారు .

రఘురామ్ పెద్ద ప్రొఫెసర్ అతనికి ఒక కొడుకు లండన్ లో డాక్టర్ ఒక కూతురు రవళి
ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యి సెటిల్ అయ్యారు అతను కెమిస్ట్రీ లో డాక్టరేట్ చేశాడు .

రఘురామ్ ఆదర్శ పురుషుడు
మొదటనే ఒక పెళ్లి అయిన అమ్మాయి భర్త భాధలు పెడుతుంటే చూసి ఆదరించి పెళ్లి చేసుకున్నాడు వారికి దూరపు బంధువు ఇంట్లో అందరూ అతని త్యాగాన్ని పొగిడారు వరసకి అక్కకి ఆడబిడ్డ అవుతుంది

రఘురామ్ భార్య కి చదువు కూడా చెప్పించాడు అన్ని నేర్పించాడు తనతో పాటు పార్టీలకు ఫంక్షన్స్ కి తీసుకెళ్లే వాడు తన భార్య కౌముది గురించి గొప్పగా చెప్పేవాడు
భగవంతుడు తన కోసం పుట్టించిన దేవత అనేవాడు .

దేనికీ లోటూ లేదు సర్వ సుఖాలూ ఉన్నాయి అలాగే
పిల్లల్ని కూడా బాగా పెంచారు
ఏ నాడు పిల్లల దగ్గర తనకు రెండో పెళ్లి అని కౌముది తెలియ నివ్వలేదు కారణం ఆ పిల్లల తండ్రి రఘురామ్
కానీ అటువంటి ఆదర్శ పురుషులు చాలా తక్కువ మంది ఉంటారు

కౌముది కూడా చాలా బాగా అందరితో కలిసి పోయేది
ఎంత మంది కి పార్టీ అన్న జాగ్రత్తగా అన్ని వండించి.పెట్టేది

రఘురామ్ కి స్త్రీందరి నీ గౌర వించే వాడు ముఖ్యంగా తన అక్కను బావగారు ఎంతో బాగా చూసేవాడు ఆమెకి
రాజకీయాలు అంటే ఇష్టం ఒకసారి ఎమ్మెల్యే గా కూడా చేసింది మంచి పేరు తెచ్చుకున్నది

ఆడవాళ్ళకి ఎన్నో పథకాలు ఏర్పాటు చేసింది
ఆడవాళ్ళకి మంచి చెడులు చూసి ఉపాధి ఏర్పాటు చేసేది
భర్త తో భాధలు పడే స్త్రీల పిల్లలను చదివించి మంచి ఉద్యోగాల్లో పెట్టింది
పెళ్ళిళ్ళు కూడా ఆదుకుని చేసేది
ఎన్నో విధాల స్త్రీ లకు అండగా నిలిచింది ఇప్పటికీ ఎవరైనా భాధలు పడుతున్న వారికి ఉద్యోగాలు ఇప్పి స్తూ ఉంటుంది

అలాగే కౌముది నీ కూడా అక్క తమ్ముడు.రఘురామ్ కి పెళ్లి చేసింది.

అయితే కౌముది కూడా వదిన గారి మాటకు ఏనాడు ఎదురు చెప్పలేదు అంటే కౌముది తగినట్టుగానే ఆవిడ ఉండేది

కౌముది మనసు కష్ట పెట్టు కోకుండ అసలు కౌముది రెండ వా పెళ్లి దని ఎవరికి తెలియకుండా జాగ్రత్త అమె మనసు బాధ పెట్ట కుండ్ చూసేది .

కౌముది కూడ్ అత్తవారింట్లో అలాగే మసలు కొనేది

రఘురామ్ కొలీగ్ ఒక ఆయన భార్య చిన్న వయసులోనే భర్త పోవడం ఇద్దరు పిల్లలను చిదివించుతు భర్త పెన్షన్ తో జీవిస్తోంది ఆమెకు పుట్టింటి వారు సాకారం ఉంది అయినా సరే రఘురామ్ కౌముది తన కుటుంబ స్నేహిురాలితో మాట్లాడి కౌసల్య ద్వారా సంబంధం చూసి పెళ్లి నిశ్చయించారు

ఈ తరంలో మొగ పిల్లలు పెరిగి పోయారు ఆడపిల్లలు ఎక్కడ దొరకడం లేదు అందుకని కుటుంబ పోషణ ఈ నాడు సమస్య కాదు కానీ జీవితానికి ఒక తోడు ఉండాలి అబ్బాయిలు ఎంతో ఆదర్శంగా ముందుకు వస్తున్నారు

ఆలా కౌసల్య తనకు తెలిసిన ఇంజినీర్ కి భార్య విదేశాల్లో ఉండి పోయింది ఇతను ఇండియా వచ్చేశాడు ఆ సంప్రదాయం ఇష్టం లేక వృద్ధులు అయిన తల్లితండ్రులను చూడాలని ఉదేశ్యం తో పాటు ఇండియా వచ్చాడు కొన్నాళ్ళు వంట మనిషి పనిమనిషి చాకిరీ చేశారు
ఒక రోజు కౌసల్య వాళ్ళ ఇంటికి వెళ్లి నప్పుడు విషయం తెలుసుకుని రఘురామ్ కౌముది ద్వారా ఆమెకు విషయం చెప్పి చిన్న పిల్లలు ఎంత కాలం నువ్వు వాళ్ళని వంటరిగా పెంచు తావు తెలిసిన కుటుంబం భయం లేదు అని చెప్పి వప్పించింది

కానీ రేవతి రఘురామ్ కొలీగ్ భార్య భారత దేశం లో పుట్టిన స్త్రీకి ఒక సారే పెళ్లి పిల్లలు వద్దు అని చెప్పింది ఆమెకు ఆమె తల్లి తండ్రుల పట్టు పట్టి ఈ పెళ్లి చేస్తున్నారు అదే పెళ్లి భాజాలు పిల్లలకి తండ్రి కావాలి కదా అని చెప్పి వప్పించారు
పిడి కిట తలంబ్రాల పెళ్లి కూతురు అంటూ సన్నాయి వారు వాయిస్తున్నా రు ఎంతో ఘనంగా పెళ్లి జరిగింది

ఈ సమాజంలో ఒక అడకి ఒక మగ తోడు అదే జీవితము ప్రతి తల్లి తండ్రి పిల్లలకోసం ఎంతో జీవితం ధార పోసి పెంచి వారి ఉన్నతి కోరుతారు పిల్లలు ఆనందంగా తమకి కొత్త దాడి వస్తాడని సంతోష పడ్డారు.

శాంతి శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!