కరోనా మాయ!

కరోనా మాయ!

రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు

       ‘ vizag’ లోని అతి పెద్ద హోలేసాల్ మార్కెట్ ‘పూర్ణమార్కెట్’ అక్కడికి 3 జిల్లాల నుంచి ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం రోజు వస్తు ఉంటారు.
ఆ రోజు కూడా ఉదయం 11 గంటలకు   చాలా బిజీ గా ఉంది,’ క్రిష్ణ’ అనే 15 ఏళ్ల కుర్రాడు తన సైకిల్ వెనక ‘3 క్రెట్ల కోడి గ్రుడ్లు
గట్టిగా కట్టి మెల్లగా నడిపించుకుంటూ జగదాంబ జంక్షన్ కి వచ్చేసరికి ఎక్కువ అ జనసమ్మర్థం ఉండడంవల్ల తన సైకిల్ తప్పించబోయి సరిగ్గా రోడ్డు మధ్యలో సైకిల్ తో సహా క్రిందపడిపోయాడు, l కోడిగుడ్ల న్ని పగిలిపోయి చిందరవందర అయిపోయే సరికి అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా గుమిగూడారు.
“అయ్యో, నేనేం చేయాలి? నా  కోడిగుడ్లు అన్ని  పగిలిపోయాయి,  నా యజమాని నన్ను కొడతాడు, బాబు రక్షించండి”, అంటూ పెద్దపెట్టున  ఏడుస్తుం డే సరికి అక్కడున్న  జనం కూడా విస్తుపోయి చూస్తున్న సమయంలో లో ఒక ముసలి వ్యక్తి ముందుకొచ్చి ‘ఒరేయ్ బాబు, ఏడవకు నీకు ఎంత కష్టం వచ్చింది రా, అంటూ ఓదారుస్తు ,” ఏడవకు బాబు, ఇంద నా వంతుగా 20 రూపాయలు ఇస్తున్నాను, ఇక్కడ నిల్చున్న బాబులు కూడా సహృదయులు తమ వంతు గా మీరు కూడా సాయం చేయాలి, పాపం చిన్న వయసులోనే ఇంత కష్టపడుతున్న ఆ బాబుని ఆదుకోండి”అంటూ అనే సరికి అక్కడ  గుమిగూడిన జనం కూడా ప్రతి ఒక్కరూ  “ఐదు, పది రూపాయలు”ఇచ్చేసరికి  క్రిష్ణ  ఎంతో సంతోషంతో పగిలిపోయిన కోడిగుడ్లు కన్నా ఎక్కువ డబ్బులు వచ్చేసరికి అందరికీ నమస్కారాలు పెడుతూ తన పడిపోయిన సైకిల్ నీ పైకి తీసి వెళ్ళిపోయాడు.
ఇలా విశాఖపట్నం లోని అన్ని ప్రధాన జంక్షన్లో దగ్గర తన తెలివితేటలు ప్రదర్శించి బాగానే సంపాదిస్తున్నాడు క్రిష్ణ.
ఆరోజు అదే మాదిరిగా’ ఎంవిపి” కాలనీలో కోడిగుడ్లు పగిలిపోయి కంటనీరు పెడుతూ నటిస్తున్న క్రిష్ణ కి, ఒక పోలీసు అధికారి పట్టుకుని ‘😭 ఏరా,! నీ నాటకం నేను నిన్న ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర చూశాను, ఇలా ఎన్ని రోజులనుంచి ప్రజలను మోసం చేస్తున్నావు, పద పోలీస్ స్టేషన్ కి ‘అని గట్టిగా అరిచేసరికి, “సార్ ,నాకు ఏమీ తెలియదు, ఇదంతా చేయిస్తున్నది  మా కొట్టు యజమాని “ఒరేయ్, ఒక్క కోడిగుడ్లు అమ్మితే ఏమొస్తుంది రా, నీ జీతం కావాలంటే రోజు ఇలా చేయు, అని మా యజమాని చెప్తేనే చేశాను, అదిగోండి, మా యజమాని, అనిగట్టిగా ఏడుస్తూ దూరంగా నిలబడి ఉన్న ఒక ముసలి వ్యక్తిని చూపిస్తూ నిలువెల్ల వణికిపోసాగాడు క్రిష్ణ”.
అక్కడ ఉన్న జనం అంతా ఆశ్చర్యంతో చూస్తుండగానే ఆ ముసలి వ్యక్తిని పట్టుకున్నాడు పోలీస్ అధికారి.
ఆ తర్వాత పోలీసు విచారణలో ఉన్న యజమాని చెప్తూ”అయ్యా!, నేనేం చేయను, నా వ్యాపారం పూర్తిగా పడిపోయింది “కరోనా లాక్ డౌన్” వలన నా దుకాణంలో కోడిగుడ్లు అమ్ముడు అవకపోవడం వల్ల బ్రతుకు భారమై ఈ ప్రకారం నా పని వాడు క్రిష్ణ చేత చేయిస్తున్నాను, ఈ పని వల్ల మోసం చేసైనా సరే వీళ్లందరినీ బ్రతికించాలి అన్న తప్పుడు ప్లాన్తో చేయించాను నన్ను క్షమించండి, ‘కరోనా జబ్బు’ వలన అధ్వాన్న పరిస్థితులు నన్ను ఇలా చేయడానికి ప్రోత్సహించాయి, ప్రజలను మోసం చేసి  నందుకు మీరు, ప్రజలు మమ్మల్ని క్షమిస్తారని ఇకముందు మాడి మసి అయిపోయినా సరే ఇలాంటి తప్పుడు పని చెయ్యను” అంటూ వలవల ఏడుస్తున్న ఆ వ్యాపారిని చూస్తూ నిర్ఘాంతపోయారు పోలీసులు.!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!