భర్తే దేవుడు

(అంశం:: “అర్థం అపార్థం”)

భర్తే దేవుడు

రచన:: జీ వీ నాయుడు

రామూ, షీలా లది ప్రేమ వివాహం. పెళ్ళై 3 నెలలే. ఉపాధికోసం ఈ ప్రేమ దంపతులే హైదరాబాద్ వచ్చారు. రామూకు హైదరాబాద్ లో ఇరువురు స్నేహితులు ఉన్నారు. వారి సలహా మేరకు ఈ జంట కడుపు చేతపట్టుకుని జైపూర్ నుంచి వచ్చారు..వారికోసం ఒక అద్దె ఇల్లు కూడా సిద్ధం చేశారు బాబు, కేతు అనే స్నేహితులు. రాము, షీలా రైలు దిగగానే వారు స్వాగతం పలికి అద్దె ఇల్లు దగ్గరకు తీసుకవెళ్లారు. ఫర్నిచర్ తో కూడిన ఇల్లు కావడంతో ఆ జంట కొంత ఊపిరి పీల్చుకొంది. రాత్రి పది గంటలవరకు నలుగురు ముచ్చట్లు పెట్టుకొన్నారు. స్నేహితులు వెళ్ళాక ప్రేమ జంట వారి ఆనందడోలికల్లో మునిగి తేలారు.
షీలా ది వర్ణించలేని అందం.
ముసలోళ్ళకే మతిపోతుంది.
మరుసటి రోజు ఉదయాన్నే బాబు. కేతు ” ఏమిటీ.. ఇంకా లెగవలేదా.. రాత్రి నిద్ర పట్టిందా.. ” అంటూ పలకరించారు. ” లేదు, కొత్త ప్రాంతం, అందులోనూ ఉపాధికోసం వచ్చాము కదా, ఆ ఆలోచన… పర్వాలేదు నిద్ర పోయాం ” అంటూ బదులిచ్చారు రాము. ఈ లోపు షీలా టీ ఇచ్చింది. టీ తాగుతూనే ఆ స్నేహితుల కళ్ళు టీ మీద లేవు. అందానికే ఈర్ష్య పుట్టే షీలా ఫై పడ్డాయి. అంతే మనసులో ఆ ఇద్దరు స్నేహితుల కు షీలా ఫై కోరికలు పెరిగాయి. రాము ” నా ఉపాధి విషయం ఏమైంది ” అని స్నేహితులను అడిగాడు. “ఈ రోజు సాయంత్రం చెబుతాను. నేను నీ కోసమే ప్రయత్నం చేస్తున్నా ‘ అంటూ బాబు బదులు ఇచ్చాడు. కేతు దీన్ని ధ్రువీకరించాడు. ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళారు. రాత్రి,8 గంటలకు తిరిగి మళ్ళీ వచ్చారు ఇద్దరు స్నేహితులు రాము ఇంటికి. ఇద్దర్నీ సాధారంగా ఆహ్వానించాడు రాము. టీ ఇవ్వమని భార్య ను సైగ చేసాడు రాము. అప్పటికే పడక మంచం కోసం సిద్దంగా ఉన్న షీలా తలలోని జాజిమల్లె పూల వాసన వారికి మత్తు ఎక్కిస్తుంది. ఇంతలోనే ఆమె టీ తీసుకవచ్చి ఇచ్చింది. ” అబ్బా.. టీ సూపర్ టేస్ట్ గా ఉంది..’ అంటూ బాబు ఆమెను కన్నార్పకుండా చూసి ఊహల్లో తేలిపోయాడు. ” రాము ” నీకు ఇప్పటికిప్పుడు ఉపాధి దొరకడం కష్టం గా ఉంది.. నీ డ్రైవింగ్ వచ్చు కదా. నేను ఒక ప్లాన్ చేసాను. మా ఫ్రెండ్ కి ఆటో ఉంది. వాడు పగటి పూట ఆటో తిప్పుతాడు. రాత్రికి వేరే వాళ్లకు కిరాయికి ఇస్తాడు. నేను వాడిని ఏదో ఒకరకంగా ఒప్పిస్తా. రాత్రులు నీకు కిరాయికి ఇప్పిస్తా. రాత్రులు అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇంతకన్నా మంచి పని ఇంకొకటి లేదు. షీలానువ్వు కూడా ఆలోచించు. మళ్ళీ ఎక్కువ రోజులు ఇలా మీరు ఖాళీ గా ఉంటే ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుక పోతారు. నీకు హైదరాబాద్ సిటీ రూట్లు పేర్లు తెలియదు కాబట్టి కొద్దీ రోజులు కేతు ను సాయంగా తోడుగా పంపుతాను ” అని తన మనసులో వేసుకున్న ప్లాన్ ను అమలు చేసుకునే లాగా బాబు ఉపాధి అవకాశం కల్పించాడు. సరే రేపు వెళ్లి ఆటో కిరాయి అంతా మాట్లాడుదాం అని బయలు దేరెందుకు లేచారు ఇద్దరు స్నేహితులు. ” భోజనం చేసి వెళ్ళండి.. ” అంటూ మర్యాద పూర్వకంగాను, తమకు సహాయం చేస్తున్నారు అనే కృతఙ్ఞతతో చెప్పింది షీలా. పర్వాలేదు ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ఓ సండే పార్టీ చేసుకుందాం అంటూ వెళ్లారు స్నేహితులు.. ” ఏమి చేద్దాం ” అంటూ రాము తన శ్రీమతి ని అడిగాడు. ” ఇప్పటికిప్పుడు జాబ్ దొరకడం కష్టం. ఏదో ఒకటీ మొదటి జాబ్ అనుకుని చేసుకుంటే, డబ్బులు వస్తాయి. పగలు ఎలాగూ ఇంటిదగ్గర ఉంటావు. హ్యాపీ గా ఉంద్దాం ” అని సలహా ఇచ్చి షీలా ఇక వారి సరసాలల్లో మునిగారు.
మరుసటి రోజు బాబు, కేతు ఉదయాన్నే రాము దగ్గరకు వచ్చారు.* నీకు మా ఫ్రెండ్ వాళ్ళ ఆటో మాట్లాడను. పగలు అతనే నడుపు కుంటాడు. రాత్రి కి నీకు ఇస్తాడు. ఏ రోజు కిరాయి ఆరోజే ఇవ్వాలి. మరి నువ్వు రెడీ అయితే నిన్ను తీసుకొని వెళ్లి పరిచయం చేసి మాట్లాడిస్తాను ” అని బాబు చెప్పడంతో రాము సిద్ధం అయ్యాడు. ముగ్గురు కలిసి ఆటో యజమాని దగ్గరికి వెళ్ళారు. అంత రెడీ. సాయంత్రం ఆటో అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
సాయంత్రం కాగానే రాము బాబు, కేతూ కలిసి వెళ్లి అటో ఇప్పించారు. కేతూ రూట్ చెప్పేదానికి రామూకు తోడు గా పంపారు.
రాత్రి 10 గంటలకు బాబు వచ్చి రాము ఇంటి తలుపు తట్టాడు.. షీలా వచ్చి తలుపు తీసింది.. ” ఇప్పుడు వచ్చారు.. ఏమిటీ ” అని అడిగింది అందోళన గా. ” ఏమీ లేదూ.. నీకు ఏమైనా కావాలేమో.. అడుగుదామని ” అంటూ నీళ్లు నమిలాడు బాబు. “అయ్యో ఇంత సేపు నిలబెట్టే మాట్లాడుతున్నా..లోపల రండీ.. కూర్చోండి ” అంటూ తమకు సహాయం చేస్తున్నారనే కృతఙ్ఞతతో పిలిచింది. ” ఆఁ పర్వాలేదు.. సరే వస్తాను.. బాయ్.. గుడ్ నైట్ షీలా ” అని చెప్పి అక్కడ నుండి బయలు దేరాడు బాబు. షిలా ఆలోచనల్లో పడింది.. ” ఇతను ఈ టైమ్ లో రావడం ఏమిటీ. నేను ఒంటరిగా ఉన్నాను కదా.. తెలిసే వచ్చాడు.. నన్ను అర్ధం చేసుకున్నాడా? అపార్ధం చేసుకున్నాడా.. రాము ఇంట్లో లేరని తెలిసి.. ఇంటికి రావడం ఏమిటీ ” ఇలా షిలా ఆలోచనలకు అంతమే లేదు. ” ఈ విషయం భర్త తో చెబితే ఏమవుతుందో.. చెప్పకపోతే ఏమవుతుందో.. నన్ను అర్ధం చేసుకుంటారా.. లేక అపార్ధం చేసుకుంటారా,? దీని ప్రభావం అటో ఫై పడితే ఎలా, ” అంటూ తనలో తాను మదన పడుతుంది. ఇలా వారం గడిచింది. ఓ రోజు ఉదయం 10 గంటలకు ఇద్దరు స్నేహితులు వచ్చారు. యోగక్షేమాలు అడిగి అక్కడే భోజనం చేసి షీలా ఫై మరింతగా కోరికలు పెంచుకున్నారు. రెండు రోజులు తరువాత మళ్ళీ రాత్రి వచ్చి బాబు తలువు తట్టాదు.” ఎవరు ” అని లోపల నుంచి అడిగింది. ” నేనూ ” అంటూ జవాబు ఇచ్చాడు బాబు.షీలా తలుపు తీసింది. ” ఏమైనా కావాలేమో అని అడగాలని వచ్చాను” అని మాటలు కలిపాడు. ఈ లోపు షీలా వాటర్ బాటిల్ ఇచ్చింది. బాటిల్ తో పాటు షీలా చెయ్యి పట్టు కున్నాడు బాబు.. ” మీరు నన్ను అర్ధం చేసుకోండి.. అపార్ధం వద్దు. నాకు నా భర్తే దేవుడు. ఇది మంచిది కాదు. మీరు మావారికి మంచి స్నేహితులు. మాకు సహాయం చేసి, నన్ను ఇలా అపార్ధం చేసుకోవడం కరెక్ట్ కాదు.. నేను ఈ విషయం ఇంట్లో చెబితే హత్యలు, ఆత్మహత్యలు అవుతాయి ” అని తన ఆవేదన వెళ్ళగక్కింది.. అంతే అతను అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
వెంటనే రాముకు కాల్ చేసాడు. ” నన్ను మీ ఆవిడ ఇంటికి రమ్మన్నది. వెళ్లాను.. ” ఏమైనా అర్జెంట్ పనేమో అనుకున్నా.. నాతో ఉండాలి. అని చెప్పింది. నేను రాముకు ద్రోహం చెయ్యలేను అని చెప్పాను. నీతో చెప్పవద్దు అన్నది ” అంటూ నమ్మించే ప్రయత్నం చేసాడు బాలు. అంతే అక్కడ నుండి బాలు రాము, కేతూ ఉన్నపళంగా ఇంటికి వచ్చారు. షీలా తలుపు తీయగానే కోపం పట్టలేక షీలా చెంప చెల్లు మనిపించాడు రాము.. అసలు ఏమీ జరిగిందో కూడా తెలుసుకోకుండానే.. షీలా ఏడుస్తూ ” నన్ను కొడతావు.. నీకు బుద్ది ఉందా.. నిన్ను దేవుడు అనుకున్నందుకా నాకు ఈ శిక్ష అనే లోపు బాబు, కేతూ మెల్లగా.అక్కడనుండి జారు కున్నారు. ” అర్ధం చేసుకోండి.. అపార్ధం కాదు. ఇలా తొందర పడడం కరెక్ట్ కాదు ” అంటూ అసలు విషయం చెప్పి బోరుమంది షీలా. తాను తొందర పడ్డానని పచ్చాత్తాప పడిన రాము తన దేవత అయిన అర్దాంగిని కౌగిలిలోకి తీసుకొని సమధాయించాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!