కష్టార్జితం

(అంశం:: “అర్థం అపార్థం”)

కష్టార్జితం

రచన:: తిరుపతి కృష్ణవేణి

లక్ష్మి పురం అనే గ్రామంలో లక్ష్మమ్మ తన రెండేండ్ల కొడుకు గోపాలంతో కలసి నివసిస్తూంది. ఆ గ్రామంలోనే పుట్టి పెరిగింది లక్ష్మమ్మ.
చిన్న తనం లోనే లక్ష్మమ్మ కు ప్రక్క గ్రామం లో ఉండే చుట్టాల అబ్బాయి కిచ్చి వివాహం చేశారు. భర్త వ్యవసాయ పనులకు వెళ్ళేవాడు. గోపాలం పుట్టిన రెండు సంవత్సరాలకే అనారోగ్యంతో భర్త మరణించాడు. పిల్లవాన్ని తీసుకొని పుట్టెడి దుఃఖంతో పుట్టింటికి చేరింది లక్ష్మమ్మ. తన అన్న ప్రక్క ఇంట్లోనే ఉంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ, తనూ, కొడుకుతో ఉంటుంది . లక్ష్మమ్మ చాలా నిజాయితీ, పట్టదలగల మనిషి.
గోపాలాన్ని బాగా పెద్ద చదువులు చదివించి మంచి ప్రయోజకున్ని చేయాలని ఆమె ఆశ. కొడుకు గోపాలం కూడా చాలా బుద్దిగా చదువు కొని ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. తాను అనుకున్నట్లు గానే కొడుకును తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా తయారు చేసింది. కొడుకు ప్రయోజకత్వాన్ని చూచి లక్ష్మమ్మ ఎంతో సంతోషించింది. కొత్త ఇల్లు కూడా కట్టుకొని స్వంత ఇంట్లోకి మకాం మార్చారు. ఇక కొడుకుకు పెళ్లి చేయాలని నిర్చయించి దగ్గర చుట్టాల అమ్మాయిని చూచి పెళ్లి జరిపించింది. చదువుకున్న అమ్మాయి,రూపవతి,గుణవతి అయిన కోడల్ని చూసి ఎంతో మురిసి పోయింది లక్ష్మమ్మ. ఇక తన కష్టాలన్నీ గట్టెక్కినట్టే ఇంత వరకు తను పడ్డ కష్టాలన్నీ మరచి కొడుకు కోడలుతో ఎంతో సంతోషంగా కాలం వెళ్ళ దీస్తుంది.పెళ్లి చేసిన రెండో సంవత్సరంలోనే కోడలు పండంటి మగబిడ్డను కన్నది.
అలా ఎంతో సంతోషంగా గడుస్తున్న తరుణంలో కాలంతో పాటు అత్తా కోడళ్ల మధ్య చిన్నచిన్న మస్పర్థలు మొదలైనాయి.
లక్ష్మమ్మ మొదటి నుండి కష్టపడి బ్రతికిన మనిషి, ఏదోవక పని చేయటం ఆమెకు అలవాటు, అందువలన పెరటి లో పండ్లు మొక్కలు మరియు కూరగాయలమొక్కలను పెంచి ఎంతో కష్టపడి వాటికి తగు పోషణ చేసి అవి కాసే కాయలు అమ్మి సొమ్ము చేసుకోని అలా వచ్చిన డబ్బును తనే దాసుకొని చిన్న చిన్న అవసరాలకు ఉపయోగించేది. అత్తగారు వచ్చిన డబ్బును తనకి
ఇవ్వకుండా తన దగ్గరే దాచుకోవడం కోడలు ప్రశాంతి కి నచ్చలేదు.
ఎంతో అన్యోన్యంగా ఉండే అత్త కోడలు కి మధ్య అలా గొడవలు మొదలయ్యాయి. .
వూరికే తిని కూర్చుంటే ఏం వస్తుంది, కూరగాయలు కాస్తే మనకు పనిచేస్తాయి, మిగిలినవి అమ్ముకొంటే నాలుగు డబ్బులు వస్తాయి. ఎదైనా అవసరానికి ఉపయోగ పడతాయి కదా అని లక్మమ్మ ఆలోచన.
లక్ష్మమ్మ ప్రక్క ఊర్లో ఉన్నతన అన్న ఇంటికి అప్పుడప్పుడు వెళ్లి వస్తుండేది.వాళ్ళది చాలా బీద కుటుంబం.రెక్కాడితేగానీ డొక్కాడనిపరిస్థితి.ఎప్పుడయినా వచ్చి పలకరించి వెళ్ళటం తప్ప వాళ్ళ నుండి ఎటవంటి సహాయం వుండేది కాదు.
కోడలు ప్రశాంతి కి చిన్నగా అనుమానం మొదలైనది. లక్ష్మమ్మ అప్పుడప్పుడు వెళ్ళేది వాళ్లకు ఏదయినా డబ్బు సహాయం చేయటానికి అనుకుంటా? తను సంపాదించిన డబ్బులు వాళ్లకు ఇచ్చి వస్తుంది అనుకుంటా! అందుకే తరచూ బయటకు వెళ్లి వస్తుంటుంది అనే అనుమానం ఆమె మనసులో నాటుకు పోయింది. ప్రతి ఏడు పండ్లు, కూరగాయలు బాగానే అమ్ముతుంది, డబ్బులు ఎవరికీ ఇస్తుంది అని మనసులో ఒకటే ఆలోచన! తన సొమ్ము నాదే కదా ఎంతో కొంత ఇ స్తే ఏ వయినా కొనుక్కునే దాన్ని కదా? డబ్బులు ఎక్కడ దాస్తుందో అర్థం కావటం లేదు? ఇలా మనసులో పరి పరి విధాలుగా అలోసిస్తూండేది. రోజు రోజురోజుకు అనుమానం పెనుభూతంగా మారింది. పేరుకు ప్రశాంతి గానీ మనసంతా ఎప్పుడు అశాంతి గానే వుంటుండేది. ఇలా అత్త కోడలు ప్రతి చిన్నవిషయానికీ గొడవలు పడుతూ ఒకరి నొకరు అర్థం చేసు కోక పోగా, అపర్ధాలతోనే కాలం వెళ్ళ దీస్తున్నారు.
వీళ్లిద్దరి తగాదాలు తీర్చలేక గోపాలానికి మనఃశాంతి లేకుండా పోయింది. అప్పుడప్పుడు అమ్మకే సర్ది చెప్పాలని చూస్తాడు, కానీ నాకు కాదు రా చెప్పటం నీ భార్యకి చెప్పుకో!మిమ్మల్ని నయా పైసా అడగటం లేదు? నాకు మందు మాకులకి ఖర్చు పెట్టుకుంటున్నది ఆ సొమ్మే!అది నా కష్టార్జితం. దాని పెత్తనం ఏంటి!అంటుంది లక్ష్మమ్మ?ఇక చేచేది ఏమి లేని గోపాలం భార్య ప్రశాంతి కి నచ్చ చెప్పాలని చూసేవాడు, మీరెన్నయిన చెప్పండ మీ అమ్మ చేస్తున్న పని సరిఅయినది కాదు?మనకి కాకుండా డబ్బు ఎవరికీ ఇస్తున్నట్టు చెప్పమనండి? అప్పుడప్పుడు మీ మామయ్య వచ్చి పలకరించి వెళ్తున్నాడు. అంటే డబ్బు ఇస్తుందిఅనే కదా?కొడుకు కోడలు కన్న వాళ్ళ అన్నయ్యే ఎక్కువా?అలాంటప్పుడు నేనెందుకు అన్నం పెట్టాలి ఆమెనే వండుకో మనండీ, అంటుంది ప్రశాంతి.
భర్తని ఆఫీసుకి పంపించిన తర్వాత పక్కింటి పార్వతితో కబుర్లు చెపుతూ, సాయంత్రం వరకు గడిపేది కోడలు ప్రశాంతి. మధ్యాహ్నం ఇంట్లో మిగిలి పోయిన చిన్న చిన్న పనులు చేసేది లక్ష్మమ్మ.
ఒక రోజు అనుకోకుండా ప్రమాదవశాత్తు బాత్రూంలో జారీ పడింది లక్ష్మమ్మ. దగ్గర పట్టణoలో ఉన్న పెద్ద హాస్పిటల్ లో చూపించారు కొడుకు, కోడలు.చేయి విరిగి పోయిందని సిమెంటు కట్టు వేయాలి నలుబై రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, అని డాక్టర్ గారు చెప్పి కట్టు వేసి పంపారు.
లక్ష్మమ్మ చాలా నీరసించి పోయింది. కట్టు విప్పిన తర్వాత కూడా ఫలితం లేకపోయింది.ఎంతో కష్టపడి పనిచేసే అమ్మ ఇలా మంచానికి పరిమిత మవటం కొడుకు గోపాలనికి చాలా బాధ కలిగించిది.
అమ్మమీద ప్రేమతో దగ్గరుండి సేవలు చేసాడు. రోజు రోజుకు అమ్మ పరిస్థితి విషమించటం వలన, హైదరాబాద్ లో ఉన్న మనవడికి ఫోన్ చేశారు. .మరుసటి రోజు ఉదయానికల్లా మనుమడు ఇంటికి చేరుకున్నాడు. మనుమని రాక గురించే కొన ఊపిరితో ఉన్న లక్ష్మమ్మ మనుమని చేయి పట్టుకొని చాలా సేపు నిమిరు కుంటూ పాత సామానులుంచిన గది వైపు తదేకంగా చూస్తూ కన్ను మూసింది.
పెద్ద దిక్కును కోల్పోయిన గోపాలం కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు.అమ్మ తనను ఎంతో కష్టపడి ప్రేమతో పెంచితన భవిష్యత్ ను తీర్చి దిద్దింది.
చూస్తుండగానే అమ్మజ్ఞాపకాలతో పది రోజులు గడచి పోయాయి.. ఇల్లంతా సర్దు తున్నారు.సరిగ్గా అదే సమయంలో ప్రశాంతికిపాత సామానుల గది గుర్తుకు వచ్చింది.అత్తయ్య గారు చనిపోయే ముందు అటువైపు ఎందుకు చూసారో అని అనుకుంటూ,అత్తగారి పాత పెట్టెను తెరిచింది. పాతచీరెలు, జాకెట్లు, చెత్త కాగితాలు ఉన్నాయి. అవన్నీ బయట పడేసింది. పెట్టె అడుగున ఒక పాత చీర చుట్ట మధ్యలో పొడవైన ప్లాస్టిక్ కవర్ కనిపించింది. ప్రశాంతి ఆర్చర్యంగా కవర్ ను
తెరిచింది. అందులో ప్యాక్ చేసి రబ్బర్ బాండ్స్ గట్టిగా పెట్టిన రెండు పాకెట్స్ ఉన్నాయి.వాటిని నిమ్మదిగా విప్పింది. అంతే ప్రశాంతి కళ్లు ఒక్క సారి బైర్లు కమ్మాయి. ఐదు వందలరూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. ఒక బండిల్ లో మనుమడి ఫోటో ఉన్నది. బహుశా మనుమడికి ఆ డబ్బు చెందాలని ఆ ఫోటో పెట్టి ఉంటుందని ఊహించింది ప్రశాంతి. ఇక రెండవ కవర్ విప్పింది. ఆ కట్టల్లో ఉన్నది చూసి ప్రశాంతి మాట రాక స్థాణువులా కూర్చుండి పోయింది. ఇంతకు ఆ నోట్ల కట్టల్లో ఒక కట్టరబ్బర్ బ్యాండుకు తన చిన్న ఫోటో పెట్టి ఉంది. అంటే ఆ డబ్బు తన గురించి దాచిందన్నమాట. అత్తయ్యది ఎంతగొప్ప మనసు ఆమె కష్టపడి సంపాదించిన సొమ్మంతా మా గురించే దాచింది. అత్తయ్య మనసును గ్రహించలేక పోయాను.బోరు మని ఏడ్చింది . ఆ డబ్బంతా మా గురించే దాచింది. ఏదో సమయంలో నాకు ఇచ్చాదే, అనుకుంటా?ఆమెను నానా మాటలతో బాధ పెట్టాను. ఆమెను అనవసరంగా అనుమానించాను. బహుశా చిల్లర డబ్బుల్ని నోట్లు గా మార్చటానికే తరచూ బజారుకు వెళ్తుండే దనుకుంటా! ఆమె అప్పుడప్పుడు వెళ్లి తన సంపాదనంతా వాళ్ళ పుట్టింటి వాళ్ళకు ఇచ్చేదేమోనని అనవసరంగా అపార్థం చేసుకున్నాను.
భర్త కు చెప్పుకొని బాధ పడింది ప్రశాంతి. అమ్మ మనసు నాకు తెలుసు నువ్వే సరిగా అర్ధం చేసుకోలేక పోయావు. ఇప్పుడెంత బాధపడి ఏం లాభం. అని గోపాలం నొచ్చుకున్నాడు.
అత్తమ్మ పేరు తో వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్లు, పండ్లు, మందులు, మంచి భోజనం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేద్దామండి ఇకనుండి. అత్తయ్య ఆత్మ ఐనా సంతోష పడుతుంది అన్నది ప్రశాంతి. ఏదయినా మనిషి బ్రతికి ఉన్నప్పుడేచేయాలి. వారివృద్ధాప్యంలోనే వారిని ప్రేమగా చూడాలి,అప్పుడే ప్రశాంతంగా మరణిస్తారు. వారు పోయిన తర్వాత ఎన్ని జేస్తే మాత్రం ఏం లాభం? వారు తింటారా,?చూస్తారా? ఏదో మన తృప్తికి మాత్రమే ఈ దాన ధర్మాలన్నీ అన్నాడు భర్త గోపాలం. ప్రశాంతి “మనసులోనే “అత్తయ్య గారు మిమ్మిల్ని అపార్ధంచేసుకున్నాను, మన్నించండి, మనసులోనే వేడుకుంది ప్రశాంతి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!