అంశము: జ్ఞాపకాల నిశ్శబ్దంలో
రేపటి సూర్యోదయము
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఎం.వి.చంద్రశేఖరరావు
స్వార్ధానికీ,జనహితానికీ,
జీవితంలో జరిగే పోరాటాలే,ఙ్నాపకాల
నిశ్శబ్దం!
గాంధీ వచ్చి స్వరాజ్జ్యం
తెస్తే, ఒక కాంతిరేఖ,
కానీ,జైళ్ళలోమగ్గిన ప్రతీరాత్రీ ఒక కాళరాత్రి!
ఒక ఙ్నాపక నిశ్శబ్దం!
స్వరాజ్జం సురాజ్జంగా
మారాలంటే,రేపటి
సూర్యోదయం భావితరాలకు,అందాలంటే
తప్పవు,ఙ్నాపకాల నిశ్శబ్దాలు!
వ్యక్తిత్వం మంచిమనుషులను,
మంచిమనుషులు దేశాన్నీ
తీర్చిదిద్దుతారు,
అలాంటి,మంచి
మనుషులకు ఉంటాయి,
ఎన్నో ఙ్నాపకాల నిశ్శబ్దాలు!
నేను, నా స్థానంలో, మేము,మనము రావాలంటే,విశ్వదర్శనం
చెయ్యాలీ!
అప్పుడు,ప్రపంచమే
నువ్వు,
నువ్వే ప్రపంచము!
ప్రపంచానికి ,నువ్వే
ఒక వెలుగునిచ్చే ఙ్నాపకం!