అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో
నీవు లేక నేను లేను
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: చింతా రాంబాబు
నీ వారచూపు తాకిన
నా మనస్సు తరంగమై
మది అంతరాలలో
ఎన్నో రాగాలు తీసింది
నన్ను చూసి నీవు
విసిరిన చిరునవ్వు
నా గుండెలో ప్రేమ
పువ్వులు పూయించింది
నాతో జత కడతావని
నీవే నా శ్వాస గా మారతావని
ఊహలో విహరించే నాకు
నీ పరిచయం నాకొక వసంతం
కాలం చేసే మాయలో
ఇద్దరికీ చెరో దారి చూపింది
నీవు లేక నేను లేనని
నీ జ్ఞాపకాల నిశ్శబ్దంలో
బ్రతికేస్తున్నా…