అమ్మాయి పెళ్ళి చూపులు

అమ్మాయి పెళ్ళి చూపులు

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

సూర్యుడు తూర్పున ఉదయించిన అందాలు.. పడమర అమ్మ ఒడిలోకి వెళ్లే అందాలు తూర్పు సంధ్య పడమర సంధ్య వేళ ప్రకృతి అందం అనంతము.. తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపు లో భూపాల రాగం ఎంతో రమ్యంగా ఉంటుంది

సోమేశ్వరకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, ఇంకో పిల్లాడు ఉంటే మంచి ధి అంటూ అతని తల్లి సత్తెమ్మ పట్టు పట్టింది
మొదటి మనవడు పుట్టగానే అట్టహాసంగా బారసాల చేసింది. ఆస్తి అంతా అమేధి భర్త రామారావు నిమిత్త మాత్రుడు, ఇద్దరు కొడుకులకి పెళ్లి చేసింది.
పెద్ద కొడుకుని అమె అక్కకి దత్తత ఇచ్చింది ఇంకా సోమేశ్వర ఒక్కడే కొడుకు లెక్క
మొదట మగ పిల్లాడు పుట్టడం శుభ సూచకం ఆతరువాత ఇద్దరు ఆడపిల్లలు తెల్లగా తెలివిగా ఉండి చదువుకున్నారు బామ్మ తాత కట్టిన ఇల్లు పెద్ద మెడ టేకు గుమ్మాలు కిటికీలు తలుపులు చాలా ఖరీదు ఆ నాడు 14 అంగుళాల గోడలు పెద్ద దొడ్డి ఒక ప్రక్క అరటి మామిడి సపోటా ఉసిరి కొబ్బరి నారింజ నిమ్మ బత్తాయి జామ  కరివేప వేప చెట్లు  గోరింట చెట్టు పెరట్లో ఉన్నాయి వీధి పెరట్లో మందార  నిత్య మల్లె జాజి కనకాంబరం చంద్ర కాంత మల్లె భిగాన్ విల్లా గిన్నె మాలతి గన్నేరు కరివెరు పూల చెట్లు ఉన్నాయి ఆరువందల గజాల నెలలో నువ్వా నేనా అన్నట్లు కట్టిన మెడ

మనవలను చదివించింది సోము అమాయకుడు కాదు కానీ తల్లి తండ్రి చెప్పి నట్లు వినేవాడు ఉన్న ఊళ్ళో చదువు చదివాడు హోమియో పతి చదివి ఇంట్లోనే ప్రాక్టీస్ పెట్టాడు, పిల్లాడిని ఎంబీఏ చదివించాడు. కంపెనీ వారు కెంప్ స్ సెలక్షన్ ద్వారా ఉద్యోగం వచ్చి విదేశాలకు వెళ్ళాడు అక్కడే తన ఆఫీసర్ కూతురు రమ్య ను పెళ్లి చేసుకున్నాడు

సత్తెమ్మ  కొడుకు పెళ్లి గురించి చాలా కలలు కన్నది కానీ ఏది తీర్లేదు నీ కోడలు అంటూ కాళ్ళకి దండంపెట్టించాడు
చేసిధి ఏముంది గొడవ పడటం అనవసరము అని ఊరు కొని ఊళ్ళో తెలుసున్న వా ళ్ల ను పిలిచి శ్రీ వేంకటేశ్వర స్వామి దీపా రాధన శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసి ఉండ్రాళ్ళు శ్రీ వరసిద్ది వినాయకుని నివేదన
శ్రీ ఆంజనేయునికి అప్పాలు శ్రీ దుర్గా దేవిని గారెలు వడపప్పు చలిమిడి పానకము శ్రీ నరసింహ స్వామికి శ్రీ దత్తాత్రేయుని కి నివేదన పెట్టీ పులిహార బూర్లూ ప్రసాద్ గార్లు అప్పాలు అన్ని కూడా భోజనాలు లో వడ్డించి ఘనంగా పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు తువ్వాళ్లు జాకెట్ ముక్కలు పంచి పెట్టింది

ఆ ఏమి లోటూ చీరలే పెట్ట వచ్చు అని పదిమంది అన్నారు, కొందరు వారికి ఉంటే పెట్టాలని ఉన్నదా అని అన్నారు, ఏది ఏమైనా ఘనంగా జరిగింది అని చెప్పాలి.

ఇంకా ఆడపిల్లలు ఇద్దరికీ పెళ్లి చెయ్యాలి పెద్దది ఎంబీఏ రెండోది ఇంజినీర్ చదివారు. ఇద్దరు తెల్లగా అందంగా బామ్మ మాదిరి ఉంటారు కోడలు అత్త మాటకి ఎదురు చెప్పలేదు, చెపితే ఊరు కొదు రోజు గడవదు అని తెలుసు కోడలు
లక్ష్మి కి పెద్ద పిల్ల యామిని రెండవ పిల్ల సౌడమిని ఇద్దరు అండగా ఉంటారు

పెద్ద పిల్లకోసం ఎన్నో సంభందాలు చూసాడు, ఆఖరుకి పెళ్లి వారు ఊరు తీసుకెళ్ళి కూడా హోటల్ లో చూపించాడు ఇలా పది పదిహేను సంభందాలు చూసాడు విదేశాలు వెళ్లే సంబంధ. వద్దు అని తిరగకొట్టాడు మొత్తానికి ఒక సంబంధం కుదిర్చి పెళ్లి చేశాడు

పిల్ల ఉద్యోగం చెయ్యాలి అని చెప్పింది అత్తగారు  సరే అక్కడ ఆడ పెత్తనం ఉద్యోగం మానకూడదు . పిల్లలని అత్తగారు పెంచు తాను అన్నది పెళ్లి అయితే చాలు పిల్లల సంగతి తరువాత అనుకున్నారు

ఎన్నో వంకలు పెడుతూ మీది పాత మోడల్ ఇల్లు లోపలికి గుభ్యంలా ఉంటుంది మెడ సరిగా లేదు అట్టచేడ్ బాత్ రూమ్ లేదు అంటు నసుగుతూ ఉండేవారు మీ ఇంట్లో దిగము మాకు లోడ్జి బుక్ చెయ్యమని చెప్పింది కూతురు

సోము అలాగే తల్లి అని చెప్పి లోడ్జ్ బుక్ చేసి పండుగ చేసి పంపాడు

పిల్ల పురుడుకి తొమ్మిదవ నెల వరకు పంపా లేదు పురుడు అవగానే బారసాల చేసి సారే తో పంప మని చెప్పింది అలాగే పంపారు మనవడికి గొలుసు మురుగులు తాడు ఉంగరం పెట్టాలి అని చెప్పింది అలాగే పెట్టీ పంపారు ఎప్పుడైనా మీ మనుమడు కదా అన్నారు

హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు పెద్ద పిల్ల పిల్లాడిని అత్తగారు పెంచుతూ కోడల్ని ఉద్యోగానికి పంపింది.

రెండో పిల్ల మళ్లీ పెళ్లికి రెడీ అయ్యింది, ఎన్నో సంభందాలు చూశారు

అబ్బే మీది పాత ఇల్లు లా ఉన్నది నా పిల్లాడు ఈ ఇంటికి వచ్చి ఉండ లేడు. డైనింగ్ టేబుల్ లేదు కింద తినే అలవాటు లేదు పీటల పై పెట్టీ తిన మంటు ఉంటే ఎలా? నా కొడుకు అత్త వారు అంటే హై క్లాస్ గా ఉండాలి అయిన ఈ ఇంట్లో మా అబ్బాయి ఉండాలే డు అంటూ వంటింటి దగ్గర నుంచి బాత్ రూం వరకు కెలికి కెలికి చూసింది. కాబోయే కోడలు ప్రవర్తన పరిశీలించి చూస్తే పిల్ల బక్కగా ఉన్నది అని తేల్చింది.

జాత కాలు కుదిరాయి నక్షత్రాలు కలిశాయి కదా అని చెప్పాము అయిన పిల్ల  మీ ఇంటికి వస్తుంది పిల్లాడు ఇల్లు బాగుండాలి పిల్ల ఇల్లు నచ్చక పోతే సంబంధం లేదు ఎన్నాళ్ళు ఉంటారు మీకు మేము హోటల్ బుక్ చేస్తాము

మీ కోసం ఎదో మూడు రోజులు ఉండే దానికి కారణం చెపుతున్నారు ఈ ఇంట్లో మా అమ్మ నాన్న మేము ఉంటాము మా అబ్బాయి విదేశాలు వెడుతూ హైదరాబాద్ లో వుంటాడు

పిల్ల పెళ్లి ఖర్చు పెట్టాలా ఇల్లు రీ మొడ లింగ్ చెయ్యాలా?

మాకు ఈ ల ప్రశ్నలు వేస్తే పెళ్లి చెయ్యి లేము అన్నాడు సోము.

సత్తెమ్మ మాత్రం కట్నం ఘనంగా ఇచ్చి పెళ్లి చేస్తాము అని చెప్పింది అత్తగారు మామగారు కూడా రెండు సార్లు వచ్చి చూసుకున్నారు కానీ పిల్లాడిని  తీసుకు రాలేదు

పోనీ అద్దెకు ఎక్కడికైనా వెడదామ అంటే అమ్మ నాన్న ఉండలేరు వృద్ధులు ఉంటే మంచి ఇళ్లు ఇవ్వరు.

పిల్లని పెట్టుకుని వేరే ఉండాలి అంటే ఉన్న  ఊళ్ళో ఎన్ని సమస్యలు ప్రశ్నలు అడుగుతారు అందరికీ తెలుసు పేరున్న సత్తెమ్మ గారు కొడుకు తల్లి తండ్రి నీ వదిలేసి వెళ్ళాడని పేరు

ఇలా సోము అటు తల్లి తండ్రులు ఇటు పిల్ల సంభందాలు మధ్య నలిగి పోతున్నారు.

పిల్ల పెళ్లి అంటే భయం గా ఉన్నారు పోని ప్రేమించి పెళ్లి చేసుకుంటుందా అంటే అటువంటి పెంపకం కాదు

ఇదే విషయం కొడుకు తో అంటే నాన్న గారు మీరు ఉండగా పిల్ల పెళ్లి చేసుకోండి కట్నం ఎంతైనా ఇ వ్వండి నాకు మంచి చెడులు తెలియవు  మీ అస్తి మీరు తిన్న తరువాతే కదా ఆడపిల్ల ఉసురు ఉండకూడదు పెళ్లి చెయ్యండి అన్నాడు

నువ్వు హైదరాబాద్ లో ఏదైన సంబంధం చూసి పెట్టు అన్నాడు సోము

సరే అన్నాడు కొడుకు

ఎన్ని వెతికినా వారు కులంలో పెద్ద సంభందాలు దొరక లేదు అదే మాట తండ్రికి చెప్పాడు

ఇంకా తప్పలేదు వెన్నక్కి వెళ్లి పాత సంబంధం వారికే చెప్పి ఇల్లు రేమొడ లింగ్ చేయించి పెళ్లి చేశాడు ఇంట్లో కప్పులు గిన్నెలు కంచాలు మంచాలు సోఫాలు ఏసీలు ఫ్యాన్లు టీవీ అన్ని కూడా కోతని కొన్నాడు వాళ్ళు రెండు పండుగలు చెయ్యాలని చెప్పి వచ్చి నప్పుడల్లా వారం పది రోజులు ఉన్నారు పిల్ల సుఖ పడితే అంతే చాలు ఇది తల్లి తండ్రి ఆశ కదా

రెండో అల్లుడు వచ్చి కొత్త ఇల్లు కోని ఇమ్మని అడిగాడు చేసేది ఏముది?ఒక అపార్ట్మెంట్ రెండో పిల్లకి కొన్నాడు

ఆ విషయం తెలిసిన పెద్ద అల్లుడు తనకి కొనమని చెప్పాడు ఇద్దరు పిల్లలకి ఇళ్లు కోని ఇచ్చాడు

పాల ప్యాకెట్ ఇంటికి వేస్తే రూపాయి అదనము అని ఆలోచించే సోము కూతురు పెళ్లి కోసం డబ్బు అధికంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కడుపున పుట్టిన పిల్లలు ముగ్గురు మూడు చోట్ల ఉన్నారు సోము మాత్రం తల్లి తండ్రిని పెట్టుకుని చూస్తున్నాడు . అమ్మాయి పెళ్ళి మాత్రం చాలా సమస్య అయి పోయింది
ఎంత చదువు ఆస్తు లు అందం ఉన్నా మగపిల్ల వాడి తల్లి తండ్రులు ఇంకా బింకంకనే ఉన్నారు నానాటి బ్రతుకు నాటకంలో పుట్టుట గిట్టుట నిజము నట్టన డిమి పని నాటకము అన్న శ్రీ అన్న మయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సారం ప్రతి అంశంలో మనిషి కి అనుభవంగా ఉన్నది ముఖ్యం గా అమ్మాయి పెళ్లి చూపుల విషయం లో ఎందరో ఎన్నో తంటాలు పడుతూ పిల్లల జీవితాలు సవ్యంగా ఉండాలని ఆశా పడటం సహజ మే కదా మీరు ఆలోచించండి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!