కార్తీక మాస ప్రాశస్త్యం

కార్తీక మాస ప్రాశస్త్యం

రచన: శ్రీదేవి విన్నకోట

కార్తీకమాసంలో శివ నామస్మరణ నిత్యం.
పవిత్ర నదుల చన్నీటి స్నానాలు అనునిత్యం.
ప్రతిరోజు బ్రాహ్మణులకు సాలిగ్రామ దీపదానం.
దేవతామూర్తులకు ధూప
దీప ప్రసాద నైవేద్యం.
కార్తీక మాసమంతా అందరి ఇంట నోముల పంట,
పవిత్ర తోరాలతో కార్తీకనోము తీర్చేవారే  ప్రతి ఇంట.
ఎటుచూసినా ఉట్టి పడుతుంది ఆధ్యాత్మికత.
కార్తీక మాసమంటేనే మనసుకు కలిగే పరమ పవిత్రత.
సర్వం కార్తీక పురాణం వినడం శ్రవణానందకరం.
ప్రతి దినం శివాలయ దర్శనం నయనానందకరం.
పుణ్యానికి చేరువ చేసే ఆకాశదీప దర్శనం.
అన్నదమ్ములకు క్షేమకరం భగినీ హస్త భోజనం.
మనమాచరించే వన అన్న సమారాధనలు,
పైలోకాన మన చేసే పాప పుణ్యాలకి నిచ్చెనలు.
సృష్టి సమస్తం శివ కేశవ మయం.
భగవంతుడు లేని జగత్ సర్వం  నిరామయం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!