మాయరోగం

మాయరోగం

రచన: ఐశ్వర్య రెడ్డి గంట

సాటి మనిషిని చచ్చిపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.
మన మనిషి ఎదురుగా సచ్చినా కాటి దాకా పోయేది లేదు
మానవత్వం మంటగలిసి  మన్నుపాలు ఆయనమ్మ.
ముట్టుకుంటే అంటుకునే రోగం వచ్చి
సచ్చేనోయమ్మ
తిష్ట వేసి కూసోని చోద్యాలన్ని చేత్తుందే
బందాలన్ని విడదీసి బంధీలనే చేసిందే//

మనిషికి మనిషి దూరమాయెను
మమతలన్నీ మాయ మాయేను.
సుభ్రం పేరిట స్వార్థం పెరిగేను/
ఇంటికి ఎవలచ్చిన భయమయ్యే
విందులేమో గాని బోందలు గుర్తొచ్చి
కాళ్లు చేతులు వణకబట్టే//

పైస పోయిన పానము జాలని
కలోగంజో తాగుదామని
మేడలు మిద్దేలు ఉన్నోడు గాని
మింగ మెతుకు లేనోడు గాని,
కరోనా కరోనా రావద్దని
కంటి మీద కునుకు లేకున్నా
కఠోర దీక్ష చేత్తుఉన్న  ,
పాడు రోగానికి
చుట్టాలు, పక్కాలు బలియైనా
మనసంతా చెరువైనా
పంటి కింద రంధీనంతా బిగపట్టి
కష్టకాలమంతా కరగదీస్తూ
ఎవరికి వారే యమునాతీరే…
బహు చిత్రంగా మన బతుకే మారే

You May Also Like

One thought on “మాయరోగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!