ప్రేమ లేఖ

ప్రేమ లేఖ

రచయిత :: బొడ్డు హారిక

ఏ క్షణం కలిగిందో
చెప్పలేను కానీ
ప్రతి క్షణం నాతో
నడిచే నీడవయితివి
నీవే నా జీవితమంటుంటే
నీకు నన్ను జ్ఞాపకమంటున్నావు
ప్రతి క్షణం నీ పిలుపుకై
పరితపిస్తున్నాను కానీ
నీకు నేను తగనంటివి కదా
నా మదిలో చేరిన నీవు
నా నయనాలలో నిండిపోయితివి
కానీ కనులకు కానేరడం లేదుగా
నీతో పయనమునకై
హృదిలోని భావాన్ని
కనుల నుండి కారనీయక కాపాడుకొంటినిగా
నీ తలపులలోని ఈ తనువు
తీరేనా ప్రియా
నన్ను నీ జీవితంగా చేసే రోజు
ఏనాటికైనా వచ్చేనని
నా ఈ నిరీక్షణ తెలిపితినిగా…….

You May Also Like

6 thoughts on “ప్రేమ లేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!