స్వయంకృతాపరాధం

స్వయంకృతాపరాధం 

రచయిత :: శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి 

ఆరోజు ఆదివారం కావడం వలన రాజేష్ ఇంటివద్దనే ఉన్నాడు . రాజేష్ నిద్ర లేచి రైతు బజారుకెళ్ళి కూరగాయలు తీసుకుని వచ్చి భార్య రమ్య తెచ్చిన కాపీ తాగుతూ టీపాయ్ మీద ఉన్న రిమోట్ చేతిలోకి తీసుకుని టీ వీ ఆన్ చేస్తూ రమ్యా పిల్లలింకా లేవలేదా ఎంత ఆదివారమైతే మాత్రం తొమ్మిది గంటల వరకు నిద్రేంటి లేపు వాళ్ళిద్దర్నీ అన్నాడు . సరేనండీ అంటూ చిన్నూ, బన్నూ పడుకుంది చాలు నిద్ర లేదండి అంటూ తమ కొడుకులిద్దర్నీ నిద్ర లేపింది రమ్య . రాజేష్ రిమోట్ తో ఛానల్స్ మారుస్తూ ఒక ఛానల్ లో ఏదో ఒక ముఖ్య విషయం వస్తున్నట్టుగా ఆ ఛానల్ ని మూవ్ చేయకుండా ఉంచేసి ఏమొస్తుందని చూస్తున్నాడు . పెరిగిపోతున్న సైబర్ నేరాలు దీని విషయమై C I సాంబశివరావు గారితో అవగాహన కార్యక్రమం పది గంటలకు అని ఆ ఛానల్లో అడ్వర్టైజ్మంట్ వస్తుంది అది చూసిన రాజేష్ గబగబా లేచి నిలబడి నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను ఎవరూ ఛానల్ ఛేంజ్ చేయకండి అని చెప్పి బాత్ రూమ్ వైపు వెళ్ళాడు .రమ్యా తొందరగా రా ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది అంటూ భార్యని పిలిచాడు లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటూ .ఆమాటకి రమ్య నాకు ఇంకా వంట అవ్వలేదండీ సౌండ్ పెద్దగా పెట్టి మీరు చూస్తూ ఉండండి నేను వింటూ వంట త్వరగా ముగించుకుని వచ్చి కూర్చుంటాను అంది సరేనంటూ రాజేష్ టీ వీ సౌండ్ పెంచాడు .ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది నమస్కారం నేను C I సాంబశివరావు నేను మీ ముందుకు ఎందుకు రావలసి వచ్చిందంటే రోజు రోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాలు. ప్రజల్లో తెలివి పెరుగుతున్నా మోసపోతున్న వారి సంఖ్య ఏభాత్రం తగ్గక పోగా నానాటికి పెరిగిపోతుంది. దాని గురించే మీకు అవగాహన కల్పించేందుకు మీ ముందుకు వచ్చాను ఈ రోజుల్లో పేపరు తిరగేసినా , టీ వి లో వార్తలు చూస్తున్నా ఒకటే విషయం ఆన్ లైన్ లో పరిచయాలు , ప్రేమలు మోసపోవడాలు ఆ తరువాత పోలీస్ స్టేషన్ లను ఆశ్రయించడాలు ఇవే ఎక్కువైపోయాయి ప్రతీ రోజూ .అందువలన అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.అప్పటి వరకు రమ్య టీ వీ లో వచ్చేది వింటూ వంట పని పూర్తి చేసుకుని చేతులు తుడుచుకుంటూ వచ్చి టి వి ముందున్న సోఫా లో కూర్చుంది. C I గారు ఇంకా మాట్లాడుతున్నారు ఈ ప్రోగ్రాం చెయ్యడానికి మరొక అతి ముఖ్య విషయం ఏంటంటే ఈ సైబర్ నేరగాళ్ళు ముఖ్యంగా గృహిణుల ఫోన్ నెంబర్లు తెలుసుకుని వలపన్ని వారికి ముందు ఏదో రాంగ్ నంబర్లా ఫోన్ చేసి వారిని ఈ వలలోకి చిక్కేలా ప్రయత్నం చేస్తున్నారు.అందుకని గృహిణులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదా వారి వలలో చిక్కుకుని గిలగిలా కొట్టుకోవాల్సిందే. ఈ ప్రోగ్రాం చూడనివారికి కూడా చూసినవారు తెలియచేయండి.జాగ్రత్తగా ఉండండి అంటూ మరియొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం. ప్రోగ్రాం అయిపోయింది. ఎంత దారుణమండీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అంది రమ్య భయపడిపోతూ.

………

రాజేష్, రమ్య ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు. వారి అన్యోప్యతకి గుర్తుగా వారికి ఇద్దరు మగపిల్లలు అఖిల్ , గౌతమ్ . అనిల్ రెండవ తరగతి , గౌతమ్ మూడవ తరగతి చదువుతున్నారు . రాజేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నాడు . ఇంక రమ్య ఇంటివద్దనే ఉంటుంది . ప్రతీ రోజూ రాజేష్ పిల్లలిద్దరినీ స్కూల్ వద్ద దించేసి ఆఫీసుకి వెళ్ళిపోతాడు సాయంత్రం పిల్లల్ని ఇంటికి రమ్య తీసుకు వస్తుంది.
ఒకరోజు పిల్లలూ స్కూలుకి , రాజేష్ ఆఫీసు కి బయలుదేరి వెళ్తుండగా రమ్యకి అన్ నోన్ నంబరు నుండి ఫోన్ వచ్చింది రమ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనేలోగా ఆగిపోయింది ఫోన్ ఎవరి దగ్గరినుండి అని అడిగాడు రాజేష్ .ఏమో తెలియదండీ నేను మాట్లాడేసరికే కట్టయిపోయిందండీ అంది రమ్య. సరే వెళ్ళి వస్తామంటూ ముగ్గురూ బయలుదేరి వెళ్ళిపోయారు . కొంతసేపటికి అంతకు ముందు వచ్చిన నంబరు నుండే మరలా ఫోన్ వచ్చింది రమ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది దానికి అవతలి వైపు వ్యక్తి లతా ఎలా ఉన్నావు అన్నాడు లత ఎవరు ఇది లత నంబరు కాదు రాంగ్ నంబర్ అని ఫోన్ పెట్టేసింది. రమ్య.కాదు అని చెప్పేకొలదీ అతను ప్రతిరోజూ ఫోన్ చేస్తూనే ఉన్నాడు అవతలి వ్యక్తి ఒకరోజు లత కాకపోతేనే నాతో మాట్లాడొచ్చుగా సరదాగా అన్నాడు అవతలి వ్యక్తి . దానికి రమ్య సరే ఇంట్లో ఎవరూ లేరు కదా జస్ట్ టైం పాస్ కి మాట్లాడితే ఏమౌతుందిలే అయినా సరదాగానే కదా అంటున్నాడు అని ఫోన్లో మాటలు మొదలుపెట్టింది రమ్య ముక్కూ , మొఖం తెలియని వ్యక్తితో.
అతను మాట్లాడే తీయని మాటలకు ఉండగా ఉండగా రమ్య అతనితో మాట్లాడకుండా ఉండలేకపోయేది.భర్త ,పిల్లలూ బయటకు వెళ్ళిపోయాక ఒక్కొక్కసారి తనే అతనికి ఫోన్ చేసేది రమ్య. భర్త ఇంటి దగ్గర లేనప్పుడు ఫోన్ చెయ్యమని తన భర్త ఇంటివద్ద ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు ఉండడు ఇవన్నీ చెప్పేసేది రమ్య అవతలి వ్యక్తిని గుడ్డిగా నమ్మేసి.
ఇదిలా గడుస్తుండగా ఒకరోజు రమ్యతో ఫోన్ మాట్లాడే వ్యక్తి నీకు ఒక గిఫ్ట్ ఆర్డర్ చేస్తున్నాను డెలివరీ కోసం ఇంటి అడ్రస్ చెప్పమన్నాడు అది నిజమని నమ్మిన రమ్య అడ్రస్ చెప్పేసింది దానితో రాజేష్ ఇంటివద్ద ఉండని టైము ఆ వ్యక్తికి తెలుసు కదా రాజేష్ బయటకు వెళ్ళిన ఒక గంటకి సరాసరి ఇంటికే వచ్చేసాడు అవతలి వ్యక్తి. .రమ్య అతన్ని చూసి ఎవరోనని మొదట షాక్ అయిపోయినా అతని మాటల ద్వారా తెలిసింది తను ప్రతీరోజూ ఫోన్ లో మాట్లాడే వ్యక్తిని. రమ్య షాక్ నుండి బయటపడేలోపే ఆ వ్యక్తి అతని సెల్ లో వీడియో ఆన్ చేసి రమ్య పైన అత్యాచారం చేయబోయాడు.అంతలో తేరుకున్న రమ్య పక్కనే ఉన్న ఫ్లవర్ వేజ్ తీసి అవతలి వ్యక్తి తలపై బలంగా కొట్టడంతో ఆ వ్యక్తి అక్కడే కుప్పకూలి పడిపోయి ప్రాణాలువదిలేసాడు .విషయం తెలిసిన పోలీసులు హుటా హుటిన వచ్చి రమ్య ను అరెస్ట్ చేసి తీసుకొని వెళుతూ మేమెంత అవగాహన కల్పించినా ఇలాంటి కేసులు రిపీట్ అవుతూనే ఉన్నాయి అంటుంటే రమ్య మాత్రం భర్త, పిల్లలతో హాయిగా ఉండే నాకు ఈరోజు ఈ గతి పట్టింది తెలియక చేస్తే క్షమించవచ్చు కానీ నేను తెలిసి కూడా ఈ తప్పు చేసిన నాకు శిక్ష పడాల్సిందే అంతా నా స్వయంకృతాపరాధం అంటూ గుండెలవిసేలా మనసులోనే రోదించింది రమ్య.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!