కన్న తండ్రి

కన్న తండ్రి

రచన:: అపర్ణ

తనువున సగమై తనలో నేను ఉన్నా
తను మెచ్చిన సఖి నేనే అయినా
తనను నమ్మి తనతో వచ్చిన నన్ను
తనలో సగమై చేసుకుని
తన కంటి పాపలా చూసుకున్నతను
తన తనయను నవమాసాలు మోసి కని
తన చేతిలో పెట్టిన ఆ మధుర క్షణాన
తల్లిగా నేను పునర్జన్మను ఎత్తినా
తండ్రిగా మరుజన్మ తను పొందిన ఆరోజున
తన హృదయపు రాణి గా ఉన్న నన్ను తోసివేసి
తన చిట్టి మోముతో చిన్న చిరునవ్వు నవ్వి
తన హృదయమునకే కాదు తన ఇంటికే మహారాణిగా మారి
తన ఎదను తడుతున్న తన చిన్ని పాదాలను ముద్దాడి
తన తలపై పెట్టుకుని చూసుకుంటున్న ఆ కన్నతండ్రిని కొనియాడడానికి
మాటలు రాక, ఊహలు సరిపోక తలకు తట్టినది
తపన పడి రాస్తున్నా ఈ చిన్ని కవిత

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!