అభయహస్తము

అభయహస్తము.!

రచన:: పిల్లి.హజరత్తయ్య

స్నేహము మహా వృక్షములా
శాఖోపశాఖలుగా విస్తరించి
తను ఎండలో మ్రగ్గుతూ
నమ్ముకున్న వారికి నీడనిచ్చే
నిస్వార్థ అభయ హస్తమవుతుంది..!

వేరు బలంగా ఉన్నప్పుడే
చెట్టు మహావృక్షంగా ఎదుగుతుంది
వేర్లకు చెదలు పట్టినప్పుడూ
ఎరువులెన్ని వేసినా కుప్పకూలుతుంది
విశ్వసనీయత పునాదిగా ఉన్నప్పుడే
స్నేహబంధం నిలబడుతుంది..!

పచ్చికొమ్మ లాగా స్నేహం
చాలా సున్నితమైనది
ఏమాత్రం అలసత్వం వహించినా
నెయ్యమనే కొమ్మ విరిగి పోతుంది
పునరుద్ధరించు కోవాలనుకున్నా
మునుపటి ఆత్మీయత శృతి తప్పుతుంది..!

స్నేహమనే కొమ్మ విరబూయాలంటే
ఎల్లవేళలా సహకారంతో
స్నేహితులు ముందుకు సాగాల్సి ఉంటుంది..!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!