సృష్టిలో గొప్ప వరం స్నేహం
రచన:: ఎన్.రాజేష్
ఆత్మీయతకు మరో పదం
ఆప్యాయతకు మరో రూపం,
కష్టంలో తోడుండే నేస్తం
ఓడితే భుజంతట్టే స్నేహం..!
తడిచిన కన్నులు
తుడిచే గుణం,
ఒడిదుడుకుల్లో వెన్నంటి నిలిచే తత్వం.,
అనుబంద ఆప్యాయతకు
ప్రేమనందించే మార్గం..!
జీవితాభివృద్ధిలో వెలుగు చూపే దిశా నిర్దేశం,
జీవితపు చరమాంకంలో
ఓదార్పునిచ్చే ధైర్యం.,
సృష్టి లో ఇంతకన్నా గొప్పగా లేనటువంటిది స్నేహం..!
కడ దాకా నీడ లాగా నీ వెంటనే ఉండేది స్నేహం,
ఆ స్వచ్ఛమైన స్నేహంనకు అంతంగా కావాలి మరణం..
కాకూడదు ఈర్ష్య ద్వేషం,
కోపం తాపం..!
సృష్టి కే తీయదనం..
సృష్టి లో జీవుల మధ్య లభించినగొప్ప వరం..స్నేహం..!
సృష్టిలో స్నేహానికన్న మిన్న
లేదన్నది..కాదనలేని నిజం!!
***