ఓ అబలా..! ఎప్పుడు అయ్యెదవో సబల.

ఓ అబలా..! ఎప్పుడు అయ్యెదవో సబల..!!

రచన: నాగ రమేష్ మట్టపర్తి

ఓ అబలా..! ఎప్పుడు అయ్యెదవో సబల…!!!

నీ పుట్టుకే ప్రశ్నార్థకం…? ఆశ్చర్యార్ధకం….!!!
పుట్టింది ఎవరు…..???
అయ్యో…!!! ఆడపిల్ల పుట్టిందా….!!! అని…!!!

తొలి శ్వాస నుంచే వేసేస్తారు నీపై అనేక ” ఆంక్షలు ”
తుంచేస్తారు తుది శ్వాస వరకూ నీ భవిష్య ” ఆకాంక్షలు ”
ఉండనీయరు నిన్ను ” స్వేచ్ఛగా ”
తిరగనీయరు ” యధేచ్ఛగా ”
ఒంటరిగా వెళ్తే ఉండదు నీకు ఏవిధమైన ” రక్షణ ”
కోల్పోతారు మానవ మృగాలు తమ ” విచక్షణ ”
సమయానుసారంగా మారిపోతుంది నీ ” తలరాత ”
తలవంచక తప్పనిది నీ ” విధిరాత ”

అమ్మ ఒడి నుండి అంతరిక్షం వరకూ ఎదిగినా…
నీవు ఇంకా ఈ సమాజంలో ఆడపిల్లవే…!
కొందరి దృష్టిలో ఆటబొమ్మవే….!!!

ఈ భూమిని భరతమాత గా…
ఈ ప్రకృతిని స్త్రీమూర్తిగా…
స్త్రీని శక్తి స్వరూపిణిగా…
భావించే ఈ లోకంలో…. నీవు జన్మించినా కూడా….!!!
ఈ భూమి మీద, ఈ ప్రకృతిలో,
శక్తి స్వరూపిణిగా స్వేచ్ఛగా తిరిగే రోజు
ఎప్పుడు వచ్చునో నీ జీవితంలో…..!!!???

You May Also Like

One thought on “ఓ అబలా..! ఎప్పుడు అయ్యెదవో సబల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!