డబ్బు

డబ్బు

రచన: పద్మజ.పి

డబ్బు అహం కళ్ళకు కట్టిన నాడు కనిపించదు మంచి చెడు

పైసల పరవళ్ల మాటల ఒరవళ్లుకు బంధాల గట్లు తెగిపోతుంటే

కాసుల గలగలల ప్రవర్తన
దూకుళ్ళ నడమంత్రపు సిరుల
హాస్యపు నాట్యాలు..

చూసిన వారికి పంచే ఉచిత వినోద.అంతరంగ ఆలోచనలు

ఉన్న నాడు పొదుపు లేక
లేని నాడు బాధ పడక డబ్బు విలువ తెలిసి నడుచుకో

కాకు నువ్వు ఆ రంగు కాగితాల కట్టు బానిస

డబ్బు గర్వముతో జీవితానికి చీకటి నింపుకోక

వికశించే వ్యక్తిత్వానికి చిగురించే బంధానివై
ప్రతిరోజు విలువలతో వెలిగిపో.
***************************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!