జీవిత సారథి

జీవిత సారథి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయం తో మనిషి జీవన సరళి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి, ఆహారవ్యవహారాలు ఉంటాయి. సూర్య ప్రకాష్ భార్య భానుశ్రీ, కూతురు అమూల్య, పెళ్లి అయ్యి పది ఏళ్ల తరువాత పుట్టింది. అత్తగారు, పిల్లల కోసం తపన వద్దు ఎప్పుడు పుడితే అప్పుడు పుడతారు అన్నది. బాగానే ఉన్నది. పెద్ద వయస్సులో పుడితే పెంచ వద్దా అని కొందరు బంధువులు అన్నారు. ఆ ఇంట్లో అంతా పెద్ద చదువులు. ఒకళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళీ మిగిలిన అక్కలు అన్నల్ని కుటుంబాన్ని తీసుకెళ్లారు
ఆఖరి వాడు అమూల్య తండ్రి, ఒక ప్రైవేట్ కాలేజ్ లో మాథ్స్ లెక్టరెర్ గా చేస్తున్నాడు. భార్య భాను శ్రీ కూడా డిగ్రీ చదివింది, టైల్రింగ్ బాగా చేస్తోంది. పిల్లులు లేరు ఖాళీ సమయం వృద్ద కాకూడదు.
అత్తగారు టీచర్ చేసి రిటైర్ అయ్యారు. మామ, అత్త కలిసి ఆస్ట్రేలియా వెళ్లి పోయారు. సూర్య ప్రకాష్ నీ కూడా రమ్మన మని పట్టుపట్టారు. లేక లేక పుట్టిన పిల్ల. ఇండియాలోనే ఉండాలని కోరిక కానీ, నీ పిల్ల భవిష్యత్ కోసం రావలసిందే అన్నారు. పిల్లకి పదేళ్లు వచ్చాయి. అది ఆలస్యంగా పుట్టినా మనసు బాగా పరిణత చెంది ఉన్నది. అన్ని విషయాల్లో తల్లికి సహాయం చేస్తూ, చెల్లెలి మాదిరి సలహాలు ఇస్తుంది. అధారిటీగా ఉంటుంది. విదేశాల నుంచి పెద్దనాన్నల్లు పెద్ద తల్లి, పిల్లలు అత్త పిల్లలు అంతా వచ్చారు. ఇండియాలో ఫంక్షన్ చూసి చాలా రోజుల అయ్యింది. వేరే పెద్ద ఇల్లు తీసుకుని ఒక నెల ఉన్నారు. వంట మనిషిని పెట్టుకున్నారు. అందరికీ భాను శ్రీ చెయ్యలేదు ఎవరికి కావాల్సిన పిండి వంటలు వాళ్ళు గృహ ప్రియ నుంచి ఆర్డర్ పై తెప్పించుకుని, అందంగా లొట్టలు వేస్తూ వంటకాలు తిన్నారు. విదేశాల్లో డబ్బు సంపాదన మాత్రమే అక్కడ తేనెటిగా మాదిరి సంపాదించ వచ్చును. ఆ ఫారిన్ ఫుడ్ నచ్చవు, కానీ వండి పెట్టేవాళ్ళు లేక ఓపిక లేక ఎదో సరిపెట్టుకున్న జీవితము, ఆస్తులు అంతస్తులు పెంచుకుంటారు. కానీ ఆత్మీయతలు, అభిమానాలు లేవు అంతా యాంత్రికతత్వమే, మనిషి జీవితము మనీ చుట్టూ పరుగు పెడుతుంది. అంతా సంపాదించాలో, అంతా సంపాదించాక అరిగే శక్తి పోతుంది. ఏమి తినా లన్నాపడదు. అందుకే రెండు ఏళ్లలో సారి వచ్చి ఇండియాలో సుఖ పడి వెడతారు. ఓరే సూర్య నువ్వు కూడా వచ్చెయ్యిరా, కొన్నాళ్ళు ఉండి రావచ్చును అంటారు. ఎందుకు మీరు ఉండి తిప్పలు పడుతున్నారు. మళ్ళీ అక్కడ కుటుంబం అంతా ఏర్పాటు చెయ్యాలి. ఇక్కడ సెలవు ఇవ్వరు. వదిలేసి రావాలి కొత్త జీవితంలో మళ్ళీ ఎన్నో మానసిక ముల భాధలు ఉంటాయి. వద్దు అనుకున్నారు. అన్నయ్య వాళ్ళు కూడా మిక్సి ఇతర సామానులు అన్ని ఇండియా నుంచే పట్టుకు వెడతారు. పిల్లకి జ్ఞానం వచ్చింది. అక్కడ స్కులో చదవటానికి సీట్ ప్రాబ్లెమ్, ఉద్యోగం ప్రాబ్లెమ్ ఉంటుంది. కానీ అంతా పట్టు పట్టి పిల్లని ఓప్పించుకుని ఆస్ట్రేలియా బయలుదేరారు. ఇండియాలో ఫ్యూచర్ లేదు. మీ నాన్నకి నచ్చ చెప్పి బయలు దేర తీశారు, ఇంకా అమూల్య పట్టు వల్ల అంతా బయలుదేరారు. దేశం కానీ దేశం సీటు రావడానికి సమయం పట్టింది. సూర్య కూడా జాబ్లో అడ్జస్ట్ అవడానికి సమయం పట్టింది. భాను హౌజ్ వైఫ్ కనుక అక్కడి బంధువులు, బట్టలు కుట్టడం ద్వారా తొందరగా డబ్బు సంపాదించింది. ఆమె బిజినెస్ బాగుంది. వాళ్ల స్నేహితులు అంతా కూడా బాగా సహాయం చేసేవారు. భాను పిండి వంటలు బాగా చేస్తుంది. ఆర్డర్ పై మిఠాయి, అరిసెలు, చక్క వడలు, మైసూర్ పాక్, వంటివి చేసి అమ్మెది. ఏదో రకంగా నేల తిరిగేటప్పటికి డబ్బు సంపాదించేందుకు అవకాశాలు ఉన్నాయి. అమూల్య కొత్తలో ఇబ్బంది పడినా సరే పట్టుదలగక్ చదువుకుంటూ, అక్కడ నిలబడి ఇంటర్ పూర్తి చేసింది. ఇంకేమి డిగ్రీ, పీజీలు చేసేసింది. పిల్లకి పాతిక ఏళ్ళు వచ్చాయి. సంబంధం చూడాలి మళ్ళీ ఇండియాలో ఎంక్వైరీ మొదలు అయ్యింది. కానీ అమూల్య ఇండియా వెళ్లి, అక్కడి పద్దతిలో పెళ్లి చేసుకోవాలి అన్నది. సరే నీ ఇష్టం అన్నారు. ఎదిగిన పిల్లలు కదా! అయితే అమూల్య మేనత్త కలుగ చేసుకుని. అక్కడి పిల్లాడు అయితే మళ్ళీ ఇక్కడికి తెచ్చుకుని అన్ని మనం చూసుకోవాలి. ఆలా వద్దు ఇక్కడి సంబంధం చూద్దాము అన్నారు. అంతా కలిసి అమూల్య కి సంబంధం కుదిర్చి ఆస్ట్రేలియా నుంచి ఇండియా రాకుండానే, ఇండియా పద్దతి లో అన్ని ఏర్పాట్లు చేసుకుని సంప్రదాయం పెళ్లి చేశారు. ఇక్కడ పుట్టి పేరిగిన పిల్లలు విదేశాల్లో అడ్జస్ట్ అవడం కష్టం, మన సంప్రదాయాలు వేరు, అందుకే పిల్లల్ని మన పద్దతిలో పెంచాక, అదే పద్దతిలో జీవితం మార్గము గడవాలి. మార్పు సహజమే కానీ, పూర్తి మార్పు అంటే ముఖ్యంగా ఆడపిల్లలకి బాగా కష్టం, అత్తింటి విధానాలు, సంప్రదాయాలు అన్ని మార్పు వస్తాయి. అమూల్య సంపద కలిగిన, జీవితానికి అర్థం చేసుకుని కుటుంబాన్ని చూసుకుంటూ ఉండటమే సుఖము అనుకున్నది. అందుకే చదివిన చదువుకు సరిపడా ఉద్యోగం చేసే అబ్బాయి అయితేనే కుదురుతుంది. అనుకున్నారు. కానీ దొరకవద్దా! నుదిటిరాతను బట్టి ఉంటుంది. అందరూ కావాలని ఆస్ట్రేలియాకు వాళ్ళని తెచ్చారు కనుక సరిపడా సంబంధం ఏరి చేశారు. అటునుండి వంద ఇటు నుంచి వంద రెండు వందల మందికి ఘనంగా భోజనాలు, సారి అన్ని పెట్టీ పిల్లకి పెళ్లి చేశారు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అని శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సన్నాయి లో మ్రోగింది. బంధువులు అంతా ఆనంద పడ్డారు. ఏ దేశం వెళ్ళినా ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయానికి టిఫిన్ కావాలి. భోజనం సమయానికి భోజనం కావాలి, ఇండియాలో రూపాయలతో సరి అదే విదేశాలకి అయితే అక్కడి డబ్బు కావాలి. సంపాదించుకోవాలి. రండి రండి అంటారు వెళ్ళాక ఓ నెల చూస్తారు. ఈ లోగా వెళ్లిన వాళ్ళు అన్ని చూసుకోవాలి లేక పోతే మహా సమస్యలు ఎదుర్కోవాలి. అందుకే నేల విడిచి సాము కాదు అన్ని చూసుకోవాలి. అందుకే అన్ని సమర్దవంతంగా ఉన్నప్పుడు ఇండియా వదిలి వెళ్ళనవసరం లేదు అంటారు. సూర్య ప్రకాష్ ఏ దేశమైన సూర్యోదయం, చంద్రోదయం అన్ని మాములే, అయితే పనులు వేరు ప్రకృతి వేరు అందుకు అనుగుణంగా జీవితం మలచుకోవాలి. అదే విజ్ఞత కానీ ఆ పరిసరాలు అన్ని కూడా సరిపోవాలి. అదే జీవిత చిత్రము. జీవిత సారథిలో ఎలాంటి మార్పులు, చేర్పులు వచ్చినా మన గమ్యాన్ని మనం నిర్దేశం చేసి పరుగుపెట్టాలి. అక్కడ ఎంతో బాగా తట్టుకొని జీవించాలి అదే జీవితము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!