శ్రావణ ఝల్లులు

శ్రావణ ఝల్లులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్య ఉదయ కిరణాలు ప్రకృతి అంతా వ్యాపించి. మేల్కొలుపుతు ఎన్నో విన్నూత్న జీవితాలుకు ఊపిరి నిస్తూ ఆనందాన్ని పంచుతున్నారు. శ్రావణ ఝల్లులు పడుతూ ప్రకృతి ఆహ్లాదంగా ఉన్నది. అనటానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏమిటి?
ఇంతా మబ్బులు వర్ణం వస్తున్నా, ఒక ప్రక్కన శ్రావణ మంగళ వారం హడావుడి మరో ప్రక్క వరలక్ష్మి వ్రత హడావుడి. మార్కెట్లో పెద్ద ఎత్తున పూలు పళ్ళు కుంకుమ, పసుపు పూజ సామాగ్రి అన్ని అమ్ముడు పోతున్నాయి. మామిడి ఆకులు నాలుగు కొమ్మలు ఇరవై రూపాయలు. కమలం పువ్వులు పువ్వు ఇరవై, కలువలు 10 రూపాయలు, ఇంకా మొగలి పూలు దొరకడమే కష్టం చామంతి, గులాబీ పూలు, పువ్వు రెండు రూపాయలు, ఇలా ధరలు ఉన్న మార్కెట్ అంతా. విపరీత జనం ఉన్నారు. ఆ జనానికి వర్షం లెక్క లేదు అమ్మవారు పూజ చేసి కృప పొందాలని ఆశా, జీవితమంతా ఆశా మాత్రమే ఉంటే రోజు గడుస్తుంది. శ్రీలేఖకి కొత్తగా పెళ్లి అయిన సంవత్సరము అత్త వారు పూజ తగువు తెచ్చారు.
సెనగలు, అరటి పళ్ళు తామల పాకులు, పట్టు చీర జాకెట్ బంగారు హరం సెట్టు కూడా తెచ్చారు. ఆ ఊళ్ళో ఉన్న బంధువుల్ని పిలుచు కున్నారు వంట మనిషి నీ పెట్టీ తొమ్మిది రకాల పిండి వంటలు
బూరెలు, పులిహోర, దద్దోజనం, లడ్డూలు, వడలు, అప్పలు, పరమన్నము, చక్రపొంగలి కట్టు పొంగలి మైసూర్ పాక్ చేయించారు. ఎంతో ఘనంగా అమ్మ వారిని అలంకరించి పిల్లచేత, అల్లుడుచేత పూజ చేయించి భోజనాలు పెట్టారు. వచ్చిన బంధువులు స్నేహితులు హితులు సన్నిహితులు అంతా కూడా చాలా ఆనందించాను. శ్రీ లేఖ సాఫ్టు వేర్ ఇంజినీర్ భర్త  ఒక పెద్ద. ఛానల్ లో టెక్నికల్ ఇంజినీర్  పెద్దలు చేసిన పెళ్లి, జీవితంలో అన్నీ భరోసాతో ఉన్నాయి. నేటి తరం ఆడపిల్లలు ఎంత పెద్ద చదువు చదివిన పూజలు నోములు వ్రతాలు సం కీర్తన కూడా చక్కగా చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి వాయినాలు రిటర్న్ గిఫ్ట్ గా హ్యాండ్ బ్యాగ్స్ ఆడవాళ్ళకి మోగ వాళ్ళకి జిప్ బ్యాగాలు పంచి పెట్టరు. అబ్బో చాలా ఘనంగా చేశారు. చిన్న పెళ్ళిలో ఉన్నటు ఉన్నది. అన్నారు అంతా కూడా దానిదే ముంది మళ్ళీ ఈ ఫంక్షన్ రాదు. ఒకసారి అది మొదటి ఏడాది కనుక కావాల్సిన వాళ్ళని పిలిచాను అన్నారు. ఈ ఏడాది ఐదు శుక్రవారాలు, నాలుగు మంగళ వరాలు రాఖీ పూర్ణిమ, శ్రీ కృష్ణ అష్టమి, ఇవన్నీ పండుగలు వీలున్నంత వరకు సెలవల్లో కలవడానికి ఇది ఒక ఆనంద సమయం అని చెప్పాలి. చక్కగా పూజలు చేసి మంగళహారతి ఇస్తే సర్వ శుభాలు శ్రీ లేఖ చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నది. అందుకే క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహా లక్ష్మికి నీ నీరజాలయకును నీరాంజనము అంటూ శ్రీ అన్నమయ్య, శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తన పాడి అందర్నీ మంత్ర ముగ్ధుల్ని చేసింది. శ్రీ లేఖ కి ఇంకా మూడు మంగళ వారాలు ఉన్నాయి. ప్రతి వారం లెక్కగా ఇచ్చిన వారికే వాయినం ఇచ్చి నోము పూర్తి చేసింది. ఆఖరి వారం మాత్రము కొంబో ప్యాక్ మాదిరి ఒక పూజ పళ్ళెం అందులో కొబ్బరి కాయ, ఐదు రకాల పళ్ళు, సెనగలు, రవికేలబట్ట, పువ్వులు, పసుపు కుంకుమ, తామాలపాకులు, వక్క ప్యాకెట్ పెట్టీ. చక్కగా సిల్వర్ పేపర్ గోల్డ్ ప్యాక్ తో ఉన్నాయి. వాటిలో ఐదు ప్యాక్ పేరంటాలుకి, ఒక ప్యాక్ అమ్మ వారికి ఐదు వందల చొప్పున కోని, ఆఖరు మంగళ వారం పేరంటాలకు ఇచ్చి దీవెన పొందింది. అంతా ఎంత శ్రద్ధగా చేసింది. అని గొప్పగా చెప్పుకున్నారు. ఈ తరం అమ్మాయిలు తెలివైన, చదువు ఉద్యోగాలు ఉన్నవాళ్లు కొంచెం సృజనాత్మకంగా కూడా పేరంటం చేస్తున్నారు. శ్రీ లేఖను మళ్ళీ సారే పెట్టీ అత్త గారింటికి పంపారు. ఆడ పిల్ల జీవితంలో అన్ని కూడా తల్లి, తండ్రి సవ్యంగా చేస్తేనే అచ్చట ముచ్చట ఆనందాలు తీరుతాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!