ఈడెక్కడి మొగుడమ్మా

(అంశం. :”చాదస్తపు మొగుడు”)

ఈడెక్కడి మొగుడమ్మా

రచయిత :: సత్య కామఋషి ‘ రుద్ర ‘


ఏం మొగుడుమ్మా…ఈడెక్కడి మొగుడమ్మా…
నాపైన తన ప్రేమను బయటకు చూపించడు,
నా మంచి మొగుడు…నా ముద్దుల మగడు..
అయినా నిత్యం నా పానం తెగ తింటుంటడు
పద్దతుల మొగుడు..మహా చాదస్తపు మొగుడు..

పొద్దుగాలలేవాలంటడు..పూజల్జేయాలంటడు.,
ఆదమరచి ఆవులిస్తే గుర్రున గుడాయించి జూస్తడు.!

పొద్ధుటేళ చుడీలొద్దంటడు, సందేళ  నైటీలొద్దంటడు,
ఏయేలనైనా చీరే చుట్టమంటడు, అదే పద్ధతంటడు.!

ఏది ఎట్టా వండిపెట్టినా..అది బాగుందని అనడు,
ఇది బాగాలేదననడు ..మస్తుగ తిని కూసుంటడు.!

గట్టిగా తుమ్మొద్దంటడు..మెల్లగా నూరొద్దంటడు..
అది చేయొద్దంటడు…ఇది చూడొద్దంటడు .!
అట్టా ఉండొద్దంటడు..ఇట్లా పండొద్దంటడు .!

ఒయ్యారంగా దరిజేరి..మురిపంగా ముద్దివ్వబోతె
అన్నన్నా ఇది యేళ కాదు..రాతిరికి సూద్దమంటడు
తీరా పొద్దుగూకినాక బోతె..గుర్రన గురుపెట్టి పండ్తడు.

ఏం మొగుడమ్మా..ఈడెక్కడి మొగుడమ్మా…
వీడు సన్నాసోడు కాడు..మరి చెడ్డోడసలే కాడు…
పాతకాలం మొగుడు, మహ చాదస్తపు మొగుడు..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!