సెల్ఫీ దొంగ

సెల్ఫీ దొంగ

రచన:: తిరుపతి కృష్ణవేణి

పోలీస్ స్టేషన్ ఆవరణ అంతా కోలాహలంగా ఉంది.దొంగతనాలు చేసి పట్టు బడిన వారందరిని పోలీస్ స్టేషన్ కు తీసుకవచ్చారు. అందులోఒకరిద్దరు చదువుకున్నవాళ్లలా కనపడుతున్నారు.మిగతా వారంతా యువకులే! రకరకాల నేరారోపణలపై పట్టుబడినవారే!
అందరినీ మోకాళ్ళపై నిలబెట్టి విచారిస్తున్నారు.
అది వెంకటేశ్వర కాలనీ ఈ మధ్య దొంగల హడావుడి ఎక్కువగా ఉంది. వేసవి కాలం కావటం వలన పిల్లల సెలవల నేపథ్యంలో ఎవరెవరు ఊర్లు వెళ్లారో తెలుసుకొని వారి ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యనే వెంకటేశ్వర కాలనీ లో పెద్ద దొంగతనం జరిగింది ఆ దొoగతనం కు పాల్పడిన దొంగ దొరికాడు అని తెలిసి వాడిని చూడటానికి జనం చాలామంది పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అందుకే స్టేషన్ అంతా జనంతో నిండిపోయిఉంది.
ఎందుకంటే ఈ విచిత్రమైన దొంగతనం చేసిన దొంగని చూద్దామని జనం గుమిగూడు తున్నారు.
అక్కడ ఉన్న వారంతా అట్లాంటి దొంగతనాలు చేసి దొరికినవారే?
అసలే
కరోనా కాలం! లాక్ డౌన్ విధించటం వలన పనులన్నీ ఆగిపోయాయి. ఎవరూ పనులు చెప్పటం లేదు. అన్ని రకాల పనులు ఆగిపోవటం వలన మధ్యతరగతి జనం కూటికి మలమలమాడుతున్నారు. ఈ తరుణంలోనే ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు
జరుగుతున్నాయి.
.అది రాత్రి 9 గంటల సమయం.
వెంకటేశ్వర కాలనీ మొదటి వీధిలో ఉన్న బిల్డింగ్ పోర్షన్ లో ఉంటున్న భార్య భర్తలు సూటికేష్ తో బయటకు వచ్చి
ప్రక్క వాటాలోని వారిని పిలిచి, మా అమ్మగారి ఇంటికి అర్జంటుగా వెళ్ళవలసి వచ్చింది అందుకే వెళ్తున్నామండి. రేపు ఆదివారం కదా! సోమవారం వస్తామండి!
కాస్త ఇల్లు చూస్తూ ఉండండి అనిచెప్పి,
ఇంటి తాళాలు వేసి కారులో బయలు దేరారు. ఇదంతా ఇంటిముందు చెట్టుక్రింద క్రీనీడలో చాటుగాఉండి గమనిస్తున్న యువకుడు ఆ కారు రోడ్ చివరకు వెళ్లే వరకూ చూస్తు అక్కడే ఉండి తన ఆలోచనలకు పదును పెట్టాడు. రాత్రి ఒంటగంటకు ఆ యువకుడు తాళాలు తీయ టానికి కావలసిన పని ముట్లని తీసుకొని ఆ ఇంటి వైపు వచ్చాడు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు పక్కింట్లో కూలర్లు తిరిగే శబ్ధం వినిపిస్తుంది ఇప్పుడప్పుడే లేవరు, చాలా జాగ్రత్తగా పని పూర్తి చెయ్యాలి దొరికితేనే! దొంగ,దొరకనంత వరకు దొరే కదా!అనుకొని తను వచ్చిన పనికి ఉపక్రమించాడు.
వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది తాళాలు తీయటానికి వెంట తెచ్చిన పని ముట్లను చిన్నగా తీశాడు.
వీలైనంత త్వరగా నా పని పూర్తి చేసుకొని బయటపడాలి. అనుకొని గేటు దూకి లోపలికి ప్రవేశించాడు. గేటు దూకినంత వరకు బాగానే ఉంది. ఇప్పడు ఇంటి తాళాలు తియ్యాలి.?
చిన్నగా తియ్యటం మొదలు పెట్టాడు. గుండే దడ్ ధడ్ మని కొట్టు కుంటుంది. తాళం సంగతి ఏమో గానీ నా గుండె చప్పుడుకే ఎవరయినా లేగుస్తారేమో అనిపించింది. అంతా ఆందోళనగా ఉంది. అలవాటు లేని పని కదా! ఎలాగోలా తలుపు తాళాలు తీసి లోపలికి ప్రవేశించాను. ఇకపోతే బీరువా తాళాలు అవి ఎక్కడ పెట్టారో దిండ్లు పరుపుల క్రింద వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ పడేస్తే అవే వుంటాయి కదా కనపడకుండా పెట్టారు. అని విసుక్కుంటూ వెతుకుతున్నాడు. మొత్తానికి దొరికాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టక టక బీరువా తెరిచి సర్దటం మొదలు పెట్టాడు.
బీరువా మొత్తం కాళీ చేసి మంచం మీద పెట్టాడు. కొత్త, కొత్త టీ షర్ట్స్, చీరలు, బంగారునగలు, పిల్లల బట్టలు, గోల్డ్ అన్నీ మంచిగా సర్దుకొని వివరంగాఒక ప్రక్కన పెట్టుకున్నాడు.
పైనవున్న కాళీ బ్యాగ్స్ తీసిఒక్కొక్కటిగా సర్దుకోవాలి అనుకొని ” నా అదృష్టం బాగుంది ” అని మనసులో సంతోషoతో పొంగి పోతున్నాడు. ఎప్పుడు,బంగారమంటే
సరిగా తెలియని నేను,
ఒకసారి మెళ్ళో గొలుసు వేసుకొని చూద్దాం!ఎలా ఉంటుందో అని వేసుకున్నాడు.
అంతటితో ఆగకుండా ఉప్పొంగు తున్న ఉత్సాహంలో తనని తాను అద్దంలో చూసుకొని ఎంతో మురిసిపోయాడు.
రకరకాలఫోజుల్లోటకటకా కొన్ని సెల్ఫీలు దిగాడు. ఆ తరువాత ఫోన్ చార్జింగ్ తక్కువగా ఉంది.
ఛార్జింగ్, పెడితే పోలా అని చార్జర్ కోసం వెతికాడు. తన అదృష్టం కొద్ది డ్రస్సింగ్ టేబుల్ మీదనే చార్జర్ వుండటంతో చార్జింగ్ పెట్టీ ఉక్కగా ఉంది చెమటలతో వొళ్ళంతా మండి పోతుంది అని హాయిగా స్నానం చేసి వచ్చి రిలాక్సుగా ఎ.సి వేసుకొని కాళీ బ్యాగ్స్ లో ఇవన్ని చక్కగా సర్ధుకుందాం, అనుకొని హుషారుగా స్నానానికి వెళ్ళాడు ఆ యువకుడు. షవర్ ఆన్ చేసుకుని ఆడుతూ పాడుతూ స్నానానికి ఉపక్రమించాడు. బయట నుండి ప్లడ్ లైట్స్ వెలుతురు లాగా కిటికి లోనుండి ఇంట్లో పెద్దగా వెలుగు పడుతుంది. అంతే తన బుర్రఅంతా ఒక్కసారిగా మొద్దు బారినట్లు అయ్యింది! అంతలోనే తేరుకొని
ఇప్పుడు ఎదో జరగబోతుంది? నేను ఎదో ఒకటి చెయ్యాలి ఆలోచిస్తే లాభం లేదు. ఇంటిముందుకు ఎవరో వచ్చినట్లుగాఉంది.
ఏదో అనర్థం జరిగబోతున్నట్లు ఉంది?తన బుర్ర వెయ్యి కిలో వాట్స్ బల్బు లా పని చేసింది. అంతలో బయట నుండి దొంగ దొంగా అనే అరుపులు కేకలతో జనాలంతా పోగయ్యారు., అని అర్ధం అయ్యింది. నాకు ప్రమాదం ముంచుకొస్తుంది. అనుకొని ఒక్క సారిగా డోరు తెరుచుకొనిఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తెరుచు కొని రోడ్డున పడ్డాడు.
అంతే పోగయిన జనమంతా ఒక్కసారిగా ఆ యువకుడికి దారిఇచ్ఛారు.వాణ్ణి చూచి భయపడ్డారు. వాడి అవతారం అలాఉంది మరి!
కన్ను మూసి తెరిచే లోగా ఆ యువకుడు మాయం అయ్యాడు. అక్కడ వున్న వాళ్ళంతా ఆ దొంగని పట్టుకో లేక పోయామే అని తెగ బాధ పడ్డారు. ఎందుకు పట్టుకోలేక పోయారో కొందరికి అర్థమే కాలేదు? ఏమి జరిగిందో, కూడాఅర్ధం కాలేదు.కళ్ళల్లోమెరుపు మెరిసి నట్టు అయింది.
ఆషాకు నుండి బయటకి రాలేక పోయారు.
ఎందుకు వదిలేసారు వాడిని అని ఒకరు? ఏం పట్టు కుంటాం చెప్పండి?వాడి ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేదాయే!వాడిని ఎలా పట్టు కుంటాము,? అని కొందరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని,లోపల ఏం వున్నాయో,ఏం పోయాయే, చూద్దాం పదండి, అంటూ అందరూ లోపలకి వెళ్ళారు. వస్తువు లన్నిసర్ది పెట్టీ వున్నాయి.ఏ వస్తువు కూడా పోయినట్లు లేదు. పోనీలే, అన్నీ వున్నాయి, అనుకున్నారు. ఇంతలో ఫోన్ రింగ్ ఎక్కడో వినిపిస్తుంది? అని అందరూ అటు వైపూ తిరిగారు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంది.చాలా మెసేజ్ లు వస్తున్నాయి. అందులో “దయచేసి మా ఫోన్ ఇచ్చేయండి “అఫోన్ లో చాలా అవసరమైన సమాచారం ఉంది.మీకు మంచి బహుమతి కూడా ఇస్తామండి, అని!
మెసేజ్ లు వస్తున్నాయి! ఓహో ఈ ఫోన్ కూడా వాడిది కాదన్న మాట?ఆ వీధి వాళ్ళు
పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటా హుటిన పోలీసులు రంగంలోకి దిగారు. ఫోన్ ఆన్ చేసివచ్చిన
మేసేజ్ ల ఆధారంగా ఆ ఫోన్ ఎవరిదో వాళ్ళకి సమాచారం అందచేసారు అందులో వున్న సెల్ఫీ ల ఆధారంగా ఆ దొంగని పట్టుకున్నారు. మోకాళ్ళపై నిలబడి ఎందుకిలా నా ఖర్మ కాలి పోయింది? అని సిగ్గుతో తల దించుకున్నాడు, సేల్ఫీ దొంగ.
కష్టపడి పనిచేసుకొని బ్రతకాలి కాని పరువు పోయే ఇలాంటి దొంగ పనులు జీవితంలో మరలా చేయరాదు.
అని మనసులో ఎంతగానో
కుములిపోయాడు.
+++++++

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!