ప్రియతమా

ప్రియతమా

రచన:: రాయల అనీల

అబ్బా… చెట్ల ఆకులన్నీ ఇలా రోడ్ల మీద పరుచుకొని ఈ దారి గుండా వెళ్ళే వారికి స్వాగతం పలుకుతూ ఎంత బాగుంది, ఆ రంగు రంగుల పూలు గాలి వీచినప్పుడల్లా మీద పడుతూ చిరు స్పర్శ లా పలకరిస్తూ ఆహా ఎంత బాగుంది…కానీ చెట్ల కి ఆకులు లేక బోసిపోయినట్లు అస్సలు ఏమి బాగోలేదు..కానీ కొత్త చిగురులు వస్తాయి కాబట్టి ఓకే అవి కూడా భలే ఉంటాయి లేత ఆకు పచ్చ రంగులో…హా దీనిని శిశిర ఋతువు అంటారంట అమ్మ చెప్పింది..
మళ్ళీ వసంత ఋతువులో మళ్ళీ కొత్త చిగురులు తొడిగి ఈ చెట్లకు కొత్త అందాన్ని తీసుకొస్తాయని….

ప్రియతమా నీతో కలిసి నడుస్తూ ఈ ప్రకృతి వింతలన్ని చూడాలని ఉంది కానీ ఈ క్షణం నువ్వు నా పక్కన లేకపోవచ్చు కానీ నా మనసు నిండా ఉంది నువ్వేగా…నా మనసునే ఓ లేఖ లా రాస్తే….
హ ఆ బెంచ్ ఖాళీ గా ఉంది అక్కడ కూర్చుందాం….ఏం రాద్దాం

ప్రియతమా…..తెలియని వ్యక్తిగా తెలిసిన వాళ్ళ ద్వారా పరిచయమయ్యావు….కలిసింది కొన్ని క్షణాలైనా విడదీయలేని బంధంగా ముడిపడిపోయావ్ కేవలం నీ చూపులతోనే నన్ను కట్టిపడేసావ్ ఏమని చెప్పను ఆ క్షణం నుండే నాలో నీవై నేనే నాలో లేకుండా చేసావ్ ……

కలలో కూడా కలగనలేదు నేను ఇలా ఒకరికై తపిస్తూ దూరం నుండే వారిని అభిమానిస్తూ ,ఆనందపడే రోజులు వస్తాయని ……క్షణమైనా ఊహించలేదు నేను కూడా ప్రేమ అనే మాయలో పడి నా లోకాన్ని మరచి నీ లోకం లో బ్రతుకుతానని …..

ఏం మాయ చేసావో తెలీదు నా లోకంలో హాయిగా ఉన్న నన్ను నీ మాయతో నీ మైకం కమ్మేసేలా చేసావుఅన్ని నువ్వే చేసి ఇప్పుడు ఏమి తెలియనట్లు ప్రశాంతంగా ఉంటున్నావానన్ను నీ ఆలోచనల్లో ముంచి ……

ఏం మంత్రమేసి అల్లేసావో కానీ ప్రతి రేయి కలలోను, ప్రతి ఉదయం ఉహల్లోనూ నీ తలపులే ,నీ ధ్యాసే …..

నీ మీద నా ప్రేమ ఎంతంటేసముద్రమంత లోతైనది ,ఆకాశమంత విశాలమైనదిఅని చెప్పలేను …. అలా చెబితేనే తెలుస్తుంది అంటే నేను నమ్మనునీవు నా దరి చేరినప్పుడు అది నీకే తెలుస్తుంది ….నువ్వు నా జీవితంలో ఒక పేజీవి కాదునీవే నా జీవిత సగ భాగానివి ……

నువ్వు ఎదురు పడినప్పుడల్లానా గుండె లయని నా ఆధీనం లోనే లేకుండా చేస్తావ్ ….. నీ చూపులతో

నీ  తీయని పలుకులు నాకై కాకపోయినా నీ స్వరం వినిపించినప్పుడల్లా నా మదిలో తెలియని అలజడిని రేపుతున్నాయి…

నీ పెదవులు పలకనని మారం చేస్తున్నా నీ కళ్ళు నాతో ఎన్నో ఊసులు చెబుతున్నాయ్ ……
ఆ చూపుల భాషను దాటి నీ మనసునే పదాలుగా చేసి నీ పెదాలతో నా పేరు ని పలికే రోజు కోసం
ఆ చినుకుకెయి  ఈ పుడమి ఎదురు చూసినట్లు, ఆకులు రాలినా చిరు చిగురులకై ఈ చెట్లు వేచునట్లు వేచున్నా….

నాతో నీకున్న ఆ కాస్త పరిచయానికే ఆలస్యమైందని నా భద్రతకై నాకు తెలియదనుకొని నా వెనుకే వచ్చావ్ ఎంత ముచ్చటేసిందో ఆ రోజు  …..కానీ నాకు కావాల్సింది అది కాదు ….నువ్వు నా వెనుక కాదు నా పక్కన ,నా తోడుగా నడవాలి ….

జీవితాంతంప్రేమంటే ఇవ్వడమే… తీసుకోడం కాదంటారు అలా ఆశించడం స్వార్ధమైతే …… నేను స్వార్థపరురాలినైనా నాకు ఆనందమేకానీ నాకు కేవలం ఒక్కటే కావాలి అది ఈ ప్రపంచం లో మరెక్కడా దొరకదు కేవలం నీ వద్దనే ఉన్నది ???ఏంటా అని ఆలోచిస్తున్నావా అది నీ మనసు బాబు ….
నా మనసు ఎప్పుడో నీ వద్దకు వచ్చేసింది ఇప్పుడు నేను ప్రాణం లేనిదానిని ఎందుకంటే మనసు లేని శరీరం ప్రాణం లేని శరీరం తో సమానం అందుకే నీ మనసు నాకు ఇచ్చేస్తే నా హృదయం లో దాన్ని భద్రంగా దాచుకుంటాను హా ఇంకా నా చిట్టి మనసు కూడా జాగ్రత్త……

నమ్మకం లేకుండా ఈ సృష్టి లో ఏ బంధం నిలబడదుమన ప్రేమ మీద , నీ మీద నమ్మకంతోనే నా హృదయంలో మొక్కను నాటాను నీ ప్రేమతో దానికి నీళ్లు పోసి బ్రతికిస్తావనే ఆశతో ……

నేను నీకు నచ్చానని నన్ను చూసినప్పుడు నీ కళ్ళలో వచ్చిన ఆ మెరుపే చెబుతుంది ఇంకా దేనికి ఈ సంకోచం నీ మనసుని తెలిపి నేరుగా నా చేయి అందుకో రాదు ….

ఈ ప్రపంచంలో అమ్మ నాన్నల ప్రేమ తర్వాత అంత విలువైనది నాకు ఏదైనా ఉందంటే అది నీ ప్రేమే….

నేనే మొదట చెప్పాలని ఆశిస్తున్నావా ప్రియతమా నీ మీద నా భావాలను మౌనంగా నీకు తెలుపుతూనే ఉన్నాను …..నీ మనసుతో నన్ను ,నా ప్రేమను గుర్తించి అర్థం చేసుకొని …నేరుగా నా చెంత చేరరాదు…..నీవు నాకు ఆ తీయని పదం చెప్పిన నాడే నీ మీద ఉన్న అంతులేని ప్రేమను అక్షరాలుగా మలిచి రాసుకున్న ఈ అక్షర మాలను నీకు అప్పగిస్తాను …..

లవ్ యూ మై లవ్ ….

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!