మధురజ్ఞాపకం

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారంగానూ”)
మధురజ్ఞాపకం
రచన::పసుమర్తి నాగేశ్వరరావు
           ఓసి ని ఇల్లు బంగారం కాను అనే మాట పదే పదే గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు సిటీ బస్ లో ప్రయాణం చేస్తున్న రామనాధం.రామనాధం ఒక మధ్యతరగతి కుటుంబం వాడు.3అక్కచెల్లెళ్ళు ఆ ఇంటికి రామనా ధమే మగ దిక్కు.నాన్న ఒక కంపెనీ లో గుమాస్తాగా పనిచేసి ఏదో బతుకు బండిని లాగించుకు వస్తున్నాడు.తల్లి గృహిణి మంచి ఆచార సంప్రదయాలతో కుటుంబాన్ని నడిపించుకొని వస్తుంది.రామనాధం కి మామ్మ ఉంది.ఆమె కొంచెం చాదస్తం ఉన్నది.ఆమెకు ప్రతీ మాటకు ని ఇల్లు బంగారం కాను అనేది ఊత పదం గా వాడేది.
          ఒక్కడే కొడుకు అవ్వడం వలన రామనాధం ముద్దుగా పెరిగాడు.బాగా చదువుకున్నాడు.కానీ చదువుకు తగ్గ ఉద్యోగం దక్కలేదు.అయినా ఆత్మవిశ్వాసం తో ముందుకెళ్తున్నా డు. తల్లిదండ్రులు మధ్యలోనే కాలం చెల్లారు.కుటుంబ భారం నెత్తి పైన వేసుకొని 3 అక్కా చెల్లెల్లుకు పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపించాడు.తను పెళ్లి చేసుకున్నాడు 2పిల్లలు ను కన్నాడు.మామ్మ మాత్రం ఇంకా బతికే ఉంది.మామ్మని రామనాధం బాగా చూసుకుంటున్నాడు.మామ్మకు కూడా రామనాధం అంటే చాలా ఇష్టం కుటుంబ భాధ్యతను నెత్తిన వేసుకొని ఇంటిని చక్కదిద్దినందుకు రామనాధాన్ని చీటికి మాటికి నీ ఇల్లు బంగారం కాను అంటూ ఉంటాది .కొన్నాళ్ళు తరవాత మామ్మ గారు కాలం చెల్లారు
       రామనాధం మధ్యతరగతి కుటుంభం కాబట్టి భేషజాలకి పోకుండా సాదా సీదా జీవనం తో సిటీ బస్ లో ఆఫీస్ కి వెళ్లి వస్తాడు.ఆరోజు ఎప్పటిలాగే ఆఫీస్ లో పని ముగించుకొని వస్తుండగా బాస్ ఒక పని అప్పజెప్పాడు అదీ కూడా చాలా త్వరగా పూర్తి చేరుకొని బాస్ దగ్గర కంగారు కంగారు గా బయట పడ్డానికి సిద్ధం అవుతున్నాడు. రామనాధం అంటే ఆఫీస్ లో అందరికి గౌరవమే. ఎవరికి ఏం పని కావాలన్న చేసేవాడు.బాస్ కి కూడా చాలా ఇష్టం
              ఏం రామనాధం అంత కంగారుగా హడావుడిగా ఉన్నావు చెప్పిన పని ఇంత హడావుడి గా చేసేశావు అని అడిగాడు.మరేమీ లేదు సర్ ఈ రోజు నా పెళ్లి రోజు నా భార్య ఏనాడు నన్ను అడగలేదు వేగం గా రండి సినిమా కి వెళదాం అని.రామనాధం కి తగ్గ భార్య మంచి చెడు ల విషయం లో కుటుంబ విషయం లో పిల్లల పెంపకం విషయంలో చాలా పద్దతిగా ఉంటాది.ఎప్పుడూ ఆమె ఏమి అడగదు మొదటిసారిగా సినిమా అంది.అందుకే ఎలా అయినా ఆమెను సినిమాకి తీసుకొని వెళ్లాలని ఆఫీస్ నుండి బయటకు రావడానికి తొందర పడుతున్నాడు
           బాస్ అడగా గానే విషయం చెప్పాడు.నీ ఇల్లు బంగారం కాను ఏ విషయం చెప్పడానికి ఇంత మొహమాటం ఎందుకు వెళ్ళు వెళ్ళు అని జేబులో నుంచి 500రూపాయలు ఇచ్చాడు.ఎంత వద్దన్నా బాస్ తీసుకుంటే గాని ఒప్పుకోలేదు ని ఇల్లు బంగారం గాను తీసుకో అని కోప్పడి జేబులో డబ్బులు పెట్టి పంపించాడు.తన మామ్మ లాగే ని ఇల్లు బంగారం కాను అని బాస్ కూడా అనడం వల్ల అది గుర్తుకు వచ్చి బస్ లో తనకు తాను నవ్వుకున్నాడు. అదొక మధుర జ్ఞాపకమైన మాట ఈలోగా తాను దిగే స్టాప్ వచ్చింది. రామనాధం బస్ దిగి ఇంటికి వెళ్లి భార్యతో సినిమాకి వెళ్ళాడు.భార్య కోర్కె తీర్చాడు
భార్య కూడా చాలా సంతోషించింది.థాంక్స్ కూడా చెప్పింది.ఓసి నీ ఇల్లు బంగారం గాను దీనికి కూడానా బుగ్గ గిల్లి  నవ్వుకున్నారు.మబ్బు చాటు చంద్రుడు ఇదంతా ఒకవైపు గమని స్తున్నాడు.
***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!