నిష్కళంక దేశభక్తుడు(పొట్టి శ్రీరాములు)

నిష్కళంక దేశభక్తుడు(పొట్టి శ్రీరాములు)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

మహాత్ముని ఆశయాలైన
శాంతి, అహింసలనే ఆయుధాలుగా చేసుకొని
ఇరువది ఐదేండ్ల ప్రాయంలోనే ధర్మపత్నీ .
పుత్రుల మరణంతో, మానవసేవే మాధవసేవ అని
హరిజనోద్ధరణే ధ్యేయంగా
సబర్మతీ ఆశ్రమమున కేగిన
ఆంధ్రజాతి రత్నమా
మీ కివే శతకోటి వందనములు..!!

స్వాతంత్ర్య సంగ్రామంలో
ముఖ్యమైన దండి సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ,
క్విట్ ఇండియా ఉద్యమాలలో
జాతిపిత స్పూర్తితో పాల్గొన్న నిరూపమాన దేశభక్తులు
మీకివే శతకోటి వందనములు……!!

మహాత్మునిచే ప్రేమ,నిస్వార్ధతలు
మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములని ఆశీస్సులు పొందిన మహానుభావులు.
హరిజనుల దేవాలయ ప్రవేశానికి పోరాడి మద్రాస్ ప్రభుత్వం చే
హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసిన దరిద్రనారాయణులే
నా పాలిట దేముళ్ళు అన్న సంఘసంస్కర్త
మీకివే శతకోటి వందనములు…..!!

ఆంధ్రరాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహారదీక్ష చేసి
ప్రధాని, ముఖ్యమంత్రిలను కూడా కాదని
ప్రత్యేక ఆంధ్రరాష్టమే నా లక్ష్యమని  ప్రాణత్యాగం చేసి మహానుభావులు
సాధు సుబ్రహ్మణ్యం ,అమర గాయకులు ఘంటసాల వారి ఆధ్వర్యంలో
అంతిమసంస్కరం పొందిన
అమరజీవి, నిష్కళంక దేశభక్త పొట్టి శ్రీరాములు
మీ కివే శతకోటి వందనములు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!