విజయ రహస్యం

విజయ రహస్యం

రచన: క్రాంతి కుమార్

ఓటమిని అంగీకరించకు
నీ ప్రయత్నాలు గెలుపు బాటలో నడిచే వరకు…

తల వంచుకుని తిరగకు
నువ్వు ఏ తప్పు చేయనంత వరకు….

మొదలైన గమనాన్ని ఆపకు
నువ్వు గమ్యం చేరుకునే వరకు….

సాగిపోతున్న ప్రయాణంలో వెనకడుగు వేయకు
నీలో సత్తువ ఉన్నంతవరకు….

నీ మాటల్లో నీ విలువ చేజారనియ్యకు
నీ అనుకున్న వాళ్ళు అర్థంచేసుకునే వరకు….

నీ అన్వేషణ ప్రయాణాన్ని ఆపకు
జీవితానికి పరమార్థం తెలుసుకునే వరకు…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!