మగువా తెలుసా నీ విలువ
రచన: దొడ్డపనేని శ్రీ విద్య
ఇంటి భాధ్యతలని సమర్థవంతంగా చేసేవారు
తన యజమానికి బానిసగా మారేవారు
ఇంటిని కోవెల గా మలిచేవారు
భారాన్ని ఆనందంగా మోసేవారు
స్వలాభాపేక్ష చూపించని నిస్వార్థులు వీరు
నిరంతర కృషితో తలమునకలయ్యే వారు
మనసు తెలుసుకొని నడుచుకునే వారు
ఇల్లాలు మకుటంలేని మారాణులు వీరు
తోడును జీవివాంతం ఊపిరి అనుకునే వారు
పిలిచే పిలుపులో ఆప్యాయత ఒలికించేవారు
ఎంతటి వారికైనా రెట్టింపు ప్రేమిను పంచేవారు
అరమరికలు లేని స్వచ్ఛమైన మనసువారు
తన వాళ్ళకి వెన్నంటి దైర్యం వీరు
తన వారి ప్రపంచమే తమది అనుకునేవారు
నమ్మిన వారి కోసం ప్రాణం ఇచ్చేవారు
మదిలోని బాధని చిరునవ్వుగా మార్చేవారు
ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచేవారు
ఇంటా బయటా నిత్యం గెలుచువారు
తన వంశ వృద్ది కోసం ప్రాణం ఇచ్చేవారు
సదా సదా పూజ్య నీయులు వీరు.