తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త

తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త

రచన:: జీ వీ నాయుడు

మతి, మధు లది ఓ మధ్యతరగతి కుటుంబం. ఇద్దరు డిగ్రీ వరకు చదువుకున్నారు. లవ్ మేరేజే అయినా పెద్దల అనుమతి తోనే జరిగింది. అయితే తల్లి దండ్రులను ఒప్పించడంలో ఇరువురికి తలకు మించిన భారమే అయింది. ఇద్దరు ప్రెవేట్ ఉద్యోగులే. రెండు ఏళ్ళు పిల్లలు వద్దనుకుని ఎంజాయ్ చేశారు. ఇక అత్త మామల సూటిపోటి మాటలకు మతి చలించిపోయింది.
అత్త మామల ఆవేదన అంతా భర్త కు వివరించింది. మధు కూడా ఇప్పుడే పిల్లలు అవసరమా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ” నాకు తెలియదు. వచ్చే ఏడాది ఈ రోజుకు పాపో బాబో ఇక్కడ ఉండాలి. లేదంటే ఈ మతి ఇక్కడ ఉండదు. ” అంటూ సీరియస్ గా చెప్పింది మతి.
రెండు నెలలు గడిచాయి. మతి తన ఫామిలి డాక్టర్ ను సంప్రదించింది. ఫ్రెగ్నెంట్ అని నిర్దారించారు దాక్టర్. ఇక మతి ఆనందానికి అవదులు లేవు. మధు సాయంత్రం ఇంటికి రాగానే ఓ చాక్లేట్ నోట్లో పెట్టింది.. మధును గట్టిగ కౌగిలించుకున్నది. ” మీరు ఇప్పుడు డాడీ సార్ ” అంటూ డాక్టర్ రిపోర్ట్ చూపింది.. ఇద్దరు సంతోషం లో మునిగి తేలారు. చక చక తొమ్మిది నెలలు పూర్తి అయ్యాయి. ఇంటికి మహాలక్షికి జన్మనిచ్చింది. ఇలా మూడేళ్లు పాప తో కాలం తెలియకుండా గడిచిపోయింది.
పాప ను ఓ కాన్వెంట్ లో చేర్చారు. కిండర్ గార్టెన్ పూర్తి అయింది. ఫస్ట్ క్లాస్ కి మరో కార్పొరేట్ స్కూల్ లో చేర్చారు. ఇద్దరు జీతం లో ఒకరి జీతం డబ్బులు పాప చదువుకు వేచించే వారు. అయిదేళ్లు ఆ కాన్వెంట్ లోనే అయిదో తరగతి పూర్తి అయింది.
ఆరవ తరగతి మరో కార్పొట్ హైస్కూల్ లో చేర్చారు. రెండు నెలల్లో మీ అమ్మాయి డల్ గా ఉన్నది. ఇలా ఉంటే మా స్కూల్ లో ఉంచుకోము. అని తల్లిదండ్రులకు హుకుం జారిచేసింది ఆ స్కూల్ హెడ్మిష్ట్రెస్..

అంతే తల్లిదండ్రులు ఆ పాప ను చదువు చదువు అంటూ బాగా ఒత్తిడి పెంచారు. కొద్దీ రోజులకు ఆ చిన్నారి మానసిక రోగిగా మారింది. అంతే అది గమనించిన తల్లిదండ్రులు ఆ చిన్నారి ని వైద్యం కోసం తరలించగా ” ఇది నయం అయ్యే వ్యాధి కాదని., జీవితం అంత మానసిక రోగి గానే ఉంటుంది ” అని బదులు ఇచ్చారు వైద్యులు. తల్లిదండ్రులు ఈ విషయం తెలుసు కొని బోరున విలపించారు.

ముద్దమందారం లాగా ఉండే ఆ పాప పేరు మసుమ. తల్లిదండ్రులు మసుమ కు మంచి ఆరోగ్యం ప్రసాధించమని మొక్కని దేవుళ్లు లేరు. సుమారు ముప్పై కి పైగా ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించారు. కుటుంబం అప్పుల పాలైంది తప్ప మసుమ ఆరోగ్యం లో ఎలాంటి మార్పు రాలేదు. ఇక చేయునది లేక వదిలిలేశారు. ఏడాది పుట్టినరోజు జరుపుకోవాలని తల్లిదండ్రులు మాట్లాడు కునే లోపే ఆ చిన్నారి శాశ్వితంగా వారికి దూరం అయింది. కేవలం మా అనాలోచిత విధానాలే మాకు శాపం అయ్యాయని మతి మధు విలపిస్తుంటే వారిని సమాధాయించడం ఎవరి తరం కాలేదు. ప్రస్తుతం కార్పొరేట్ చదువులు చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్నాయి. రాంకుల మోజులో పడ్డ తల్లిదండ్రులు బిడ్డ ల మానసిక శక్తి ని పరిగణలోనికి తీసుకోకుండా వారి శక్తికి మించిన భారం మోపడంతో బాల్యం మృత్యువు కుహరాలుగా మారుతుంది.
కార్పొరేట్ మోజులో పడి చిన్నారులను కాటికి పంపే స్థాయిలో కొనసాగే విద్యావిధానం ఫై సమర శంఖం పూరించాలి. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!